By: ABP Desam | Updated at : 29 Jan 2023 03:47 PM (IST)
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
BRS Parliamentary Meetings: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటలకు పార్టీ ఎంపీలు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. లంచ్ చేసిన అనంతరం పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కేసీఆర్.. మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. భోజనం అనంతరం సమావేశం ప్రారంభమైంది. జాతీయ పార్టీగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ అనుసరించాల్సి వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పోరాడుతూనే దేశ వ్యాప్త అంశాలపై కూడా స్పందించే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు కీలకంగా మారనున్నాయి.
ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు. రెండో రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన 2023 కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. బడ్జెట్ ముద్రణ ప్రతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరినీ అనుమతించలేదు. బడ్జెట్ సమర్పించడానికి పది రోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్ మెంట్ లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. దీన్ని ఆర్థిక మంత్రి సమక్షంలో సిబ్బందికి పంచుతారు.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరణ
కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ముందుకు వెళ్తున్న మోదీ ప్రభుత్వం.. ఎన్నికల బడ్జెట్ లో ఆ దూకుడును కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్ని ఈసారి రూ.40 వేల కోట్లకే పరిమతం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత బడ్జెట్ లో నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆమడ దూరంలో నిలవడం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పెరుగుదల, ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం ఇందుకు కారణాలుగా అంచనా వేవస్తున్నారు.
ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ సభ
నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బహిరంగ సభ పనులను పరిశీలించారు. బీఆర్ఎస్ సభాస్థలితో పాటు పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్లు, ఇతర పనుల ప్రగతిని పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ తో పాటు జాతీయ స్థాయి నేతలు వస్తున్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
రేవంత్ హౌస్ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు
పేపర్ లీకేజీపై గవర్నర్ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ
SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్ పేపర్' విషయంలో కీలక నిర్ణయం!
TSPSC Paper Leak SIT : గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127, 122 మార్కులు- మరో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్టు!
పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ
Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి
CrickPe APP: 'ఫోన్‌పే' గురించి తెలుసు - ఈ 'క్రిక్‌పే' ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చింది?