Ayyayyo Vaddamma: ‘అయ్యయ్యో వద్దమ్మా..’ శరత్‌పై దాడి.. ముక్కులోంచి రక్తం కారుతూ.. తీవ్ర గాయాలు, ఈ ఫోటోలు నిజమేనా?
ఓ యాడ్‌ను హైదరాబాద్‌కు చెందిన శరత్ అనే యువకుడు స్పూఫ్ చేయడం ద్వారా అతను రాత్రికి రాత్రే పాపులర్ అయ్యాడు. ఆ మీమ్‌ను ఇన్ స్టా రీల్స్ సహా ఎన్నో షార్ట్ వీడియో యాప్‌లలో నెటిజన్లు దాన్ని అనుకరించారు.
‘‘అయ్యయ్యో వద్దమ్మా.. పక్కనే టీకొట్టు పెట్టాను.. అందరికీ టీ ఇస్తున్నాను.. డబ్బులు వద్దు కానీ, సుఖీభవ.. సుఖీభవ’’ అంటూ ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ యాడ్‌ను హైదరాబాద్‌కు చెందిన శరత్ అనే యువకుడు స్పూఫ్ చేయడం ద్వారా అతను రాత్రికి రాత్రే పాపులర్ అయ్యాడు. ఆ మీమ్‌ను ఇన్ స్టా రీల్స్ సహా ఎన్నో షార్ట్ వీడియో యాప్‌లలో నెటిజన్లు దాన్ని అనుకరించారు. ఇప్పుడు మీమర్స్ అందరికీ అతనొక సబ్జెక్ట్ అయిపోయిన శరత్‌పై ప్రస్తుతం దాడి జరిగి తీవ్ర గాయాలతో ఉన్నాడు.
ఆ యాడ్‌పై స్పూఫ్ చేసినందుకే అతనికి ఈ సమస్య ఎదురైనట్లుగా తెలుస్తోంది. శరత్‌పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో యువకుడు శరత్‌కు బాగా గాయాలయ్యాయి. ముక్కు నుంచి రక్తం వస్తూ, ముఖంపై కూడా బాగా గాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
దాడి చేసిన వారిపై అనుమానాలు
అయితే, ఓ టీ పొడి సంస్థ రూపొందించిన ‘‘అయ్యయ్యో వద్దమ్మా..’’ అనే యాడ్ హిజ్రాలపై గౌరవం పెరిగేలా ఉంది. ఆ టీ పొడి యాడ్‌ను మాస్ డాన్సర్, పక్కా హైదరాబాదీ అయిన శరత్ రీ మేక్ చేస్తూ తీన్మార్ డాన్సు చేశాడు. అది విపరీతంగా వైరల్ అయిపోయి జనాలను బాగా ఆకర్షించింది. అయితే, ఓ వర్గం వారు మాత్రం హిజ్రాలను కించపరిచాడు అనే భావనతో ఉన్నారు. అందుకే హిజ్రాలు శరత్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్
అయితే, నిజంగా దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు అన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టతా లేదు. శరత్‌పై దాడిని కొందరు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. మరోవైపు, దాడి జరిగినట్లు చెప్తున్న వ్యక్తి డాన్సర్ శరత్ కాదని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశంపై శరతే స్వయంగా స్పందిస్తే కానీ, క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Also Read : ఆర్కేకు లాల్ సలాం ! అంత్యక్రియల ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు !
#sukhibhava
— Bebamma (@Shivasa56999133) October 18, 2021
JFF🥴 https://t.co/8usZSRdnxJ pic.twitter.com/8SkahMMsPa
This is where #sukhibhava started 🙌
— JusLikeVikki (@JuslikeVikki) October 11, 2021
Trend setter Jail Anna 😁😁😁#SaveAPfromYSRCP pic.twitter.com/kfgJJXfhaR