Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Heay Rain Started in Hyderabad- హైదరాబాద్: భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ లోని పలుచోట్ల బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తరువాత పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ లోని సూరారం, చింతల్, నిజాంపేట్, సుచిత్ర, దుండిగల్, షాపూర్ నగర్ పలు ప్రాంతాలలో ఉరుములు తో కూడిన వర్షం కురుస్తుంది.
Heay Rain Started in #Jeedimetla ⛈️⚡️😍#HyderabadRains pic.twitter.com/ajZP6EWdo8
— Hyderabad Rains (@Hyderabadrains) April 17, 2024
ఇటు కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, అమీర్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగల నుంచి ఇబ్బంది పడుతున్న నగర వాసులకు వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.