అన్వేషించండి

Benefits Of Cycling: సైక్లింగ్ అంటే ఆరోగ్యం, సైకిల్ తొక్కారంటే ఎన్నో ప్రయోజనాలు - మరి ఎందుకీ నిర్లక్ష్యం !

Health Tips: ఆరోగ్యం కాస్త బెడిసికొట్టడం, పొల్యూషన్ పెరగడంతో మళ్లీ సైకిల్ హవా మొదలైంది. కేవలం హెల్త్ కోసమే కాదు కాలుష్యం లేని రవాణాలోనూ కీలకమని హైదరాబాద్ సైక్లిస్టులు చెబుతున్నారు. 

Hyderabad Cyclists Revolution: సైకిల్ అంటే ఎందరికో చిన్ననాటి జ్ఞాపకం. సైకిల్ నేర్చుకోవటం అంటేనే ఓ పెద్ద విజయం. కానీ 21వశతాబ్దం ప్రారంభమయ్యాక మోటార్ బైక్ దే హవా. దాంతో మెల్లగా ప్రాభవం కోల్పోయిన సైకిళ్లు, ఆరోగ్యం కాస్త బెడిసికొట్టడం, పొల్యూషన్ పెరగడంతో మళ్లీ సైకిల్ హవా మొదలైంది. బైస్కిల్ క్లబ్బుల (BiCycle Clubs)తో ప్రత్యేక అవగాహనా కార్యక్రమలు చేపట్టారు. కేవలం హెల్త్ కోసమే కాదు కాలుష్యం లేని ట్రాన్స్‌పోర్ట్ (Transportion)లోనూ కీలకమని హైదరాబాద్ సైక్లిస్టులు చెబుతున్నారు. 

మెట్రో సిటీల్లో అక్కడక్కడా ప్రత్యేక లైన్లున్నాయి. అయితే అవగాహన లేకపోవటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రత్యేక లైన్ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని డిమాండ్ మొదలైంది. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు సైక్లింగ్‌తో పాటు ఆరోగ్యాన్ని పెంచే, పర్యావరణాన్ని కాపాడే అంశాలపై అవగాహన కల్పించాలి. విదేశాల్లో ఉన్న ప్రత్యేక ఏర్పాట్లను మనం కూడా గమనించాలి. ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.

స్లైకిల్ అని వింటే చాలు ఇప్పుడు టీనేజీ దాటిన చాలా మందికి బాల్యం గుర్తుకువస్తుంది. చిన్నతనంలో సైకిల్ నేర్చుకోవటం ఓ పెద్ద విజయం మనకందరికీ. పక్కతొక్కుడు (క్యాంచి) నుంచి సీట్ పైన కూర్చుని సైకిల్ తొక్కటం రాగానే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ కలుగుతుంది. పెరిగిపెద్దయ్యే కొద్దీ సైకిల్ చాలా మందికి వాహనం. కానీ 21 శతాబ్దం మొదట్లో... వేగంగా దూసుకొచ్చిన మోటార్ ఫీల్డ్... ఇంజినీరింగ్ ఆవిష్కరణలు సైకిల్‌ను మన నుంచి కాస్త దూరం చేశాయని చెప్పవచ్చు. చాలా మంది ఇప్పుడు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి బైక్ అలవాటు చేస్తున్నారు. సైకిల్ తొక్కటం, అసలు సైకిల్ కనబడటం ఇప్పుడు రేర్ థింగ్ గా మారిపోయిన తరుణంలో కొంత మంది Hyderabad Cyclists సైక్లింగ్ గొప్పతనాన్ని భావి తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. స్లైక్లింగ్ కమ్యూనిటీలుగా ఏర్పడి తమ ఫిటెనెస్ ను కాపాడుకోవటంతో పాటు వాతావరణానికి సైక్లింగ్ ఎంత మేలు చేస్తుందో తెలిసేలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అలాంటి గ్రూపులకూ ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

చాలా మందికి సైక్లింగ్ హాబీ. వారాంతపు సెలవులు దొరికితే చాలు చాలా దూర ప్రాంతాలకు సైకిల్ మీద వెళ్లిపోతుంటారు. సరిగ్గా ఇక్కడే సైక్లిస్టులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకంగా వారికంటూ లైన్లు లేకపోవటం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. లాస్ట్ ఇయర్ ఫైనల్ డే డిసెంబర్ 31న గచ్చిబౌలిలో  ఓ కారు డ్రైవర్ మద్యం మత్తులో సైకిల్ ఢీకొనటంతో 44ఏళ్ల నితిన్ అగర్వాల్ మృతి చెందటం సైక్లిస్ట్ సమాజాన్ని కలచివేసింది. వాస్తవానికి కేబీఆర్ పార్క్ (KBR Park In Hyderabad), హైటెక్స్, గచ్చిబౌలి లాంటి ఐటీ సెక్టార్ ఏరియాస్ లో సైక్లిస్టుల కోసం ప్రత్యేక లైన్లు ఉన్నప్పటికీ అలాంటి చోట్ల కూడా పట్టించుకునే వారే లేకపోవటం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. - శంతన సెల్వన్, Bicycle మేయర్ ఆఫ్ హైదరాబాద్

అసలు సైక్లింగ్ అంటే ఫిట్ నెస్ కోసమే అనే ఆలోచనల్లో చాలా మంది ప్రజలు ఉండటం అసలు సమస్యకు కారణమని సైక్లిస్టులు అభిప్రాయ పడుతున్నారు. సైకిల్ ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు  
ఇంధన ఖర్చులు తగ్గుతాయి
బద్ధకం తగ్గుతుంది
ఉద్యోగులు ఒత్తిడి జయించి జాబ్ చేసుకుంటారు
అనారోగ్యం అంటూ హాస్పిటల్స్‌కు వెళ్లడం తగ్గుతుంది

అక్కడ సైక్లింగ్‌కు స్పెషల్ ట్రీట్మెంట్..
యూరోప్ దేశాల్లో సైక్లింగ్ ను ఓ ప్రత్యేక వ్యవస్థగా చూస్తారు. ట్రాన్స్‌పోర్ట్ (రవాణా వ్యవస్థ) లో సైక్లింగ్ ఓ భాగం. సైకిల్ పై దేశాల అధినేతలే తిరుగుతూ కనిపిస్తారు. కానీ భారత్ లో అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తాయి. మోటార్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైక్లింగ్‌ను కేవలం ఆరోగ్య కోణం (HealTh Care)లో చూడటమే మొదలు పెట్టారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి మెట్రో సిటీల్లోనూ సైక్లింగ్ కోసం ప్రత్యేక లైన్స్ (Special Lane For Cyclists) లేకపోవటం నిజంగా ఆలోచించాల్సిన విషయమని సైక్లిస్టులు అంటున్నారు.

సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాఫిక్ చట్టాలను తీసుకురావాలి. రవాణా వ్యవస్థలో సైకిల్ తొక్కటాన్ని ఓ భాగంగా పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ లో వారిపట్ల ప్రవర్తించాల్సిన తీరును నేర్పించాలి. అప్పుడే పర్యావరణానికి మేలు చేసే సైక్లింగ్‌ను ప్రభుత్వమే ప్రమోట్ చేయాలని హైదరాబాద్ సైక్లిస్టులు కోరుతున్నారు. 

Also Read: డయాబెటీస్‌తో యమ డేంజర్, ఈ తప్పిదాలతో పక్షవాతం ముప్పు

Also Read: Coffee: కాఫీ వల్ల మొటిమలు పెరుగుతాయ్, దీనికి ఇవి తోడైతే మరీ డేంజర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Embed widget