27 రకాల పరిమళాలు వెదజల్లే సిరి చందన పట్టు చీర చూశారా!
27 రకాల సుగంధ ద్రవ్యాల పరిమళాలు వెదజల్లే పట్టు చీరకు పేరు పెట్టిన మంత్రులు హరీష్, కేటీఆర్.
మరో చేనేత కార్మికుడ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 27 రకాల సుగంద ద్రవ్యాల పరిమళాలతో ఓ చీరను తయారు చేసిన నేత అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. తెలంగా మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును కలిసి ఆ చీర విశిష్టత చెప్పి... ఆ చీరకు పేరు పెట్టించుకున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్ నేత కార్మికుడు. వైవిధ్యంగా తనకంటూ గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలాంటి ఆలోచనతో ఉన్న విజయ్... పరిమళాలు వెదజల్లే పట్టుచీర చేస్తే ఎలా ఉంటుందనే మనుసులో అనున్నాడు. నెలల తరబడి శ్రమించి 27 రకాల సుగంధ ద్రవ్యాల పరిమళాలు వెదజల్లే పట్టు చీరను మరమగ్గంపై నేసి అందర్నీ ఆశ్చర్యపరించాడు.
సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను మంత్రులు @KTRTRS, @trsharish ఆవిష్కరించారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 8, 2022
విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా నామకరణం చేసిన మంత్రులు, యువ చేనేత కళాకారుడు విజయ్ ను అభినందించారు. pic.twitter.com/pCV9Id9kvM
దాన్ని భద్రంగా తీసుకొచ్చి మంత్రులు హారీష్, కేటీఆర్‌కు చూపించారు విజయ్. విజయ్ చేసిన వినూత్న ఆలోచనకు మంత్రులు ముగ్దులయ్యారు. నేతన్న కోరిక మేరకు ఆ 27 సుగంధ ద్రవ్యాల పరిమళాలు వెదజల్లే చీరకు సిరి చందన పట్టుగా పేరు పెట్టారు. విజయ్ ఐడియాను, పనితనాన్ని మెచ్చుకున్నారు. ఆయన గతంలో కూడా ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో బట్టలు నేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.