అన్వేషించండి

Harish Rao: ‘గవర్నర్ ప్రసంగం పేలవం, కాంగ్రెస్ చేతులెత్తేసినట్లే’ - బీఏసీ నుంచి వెళ్లిపోయిన హరీశ్ రావు

Telangana News: గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తామని, అయితే అది పేలవంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Telangana Politics: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ కు బదులు హరీశ్ రావు హాజరయ్యారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...శాసనసభా వ్యవహారాల మంత్రికి సమాచారం కూడా ఇచ్చారు. అయితే బీఏసీ సమావేశానికి హరీశ్ రావు రావడాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. కేసీఆర్ కు బదులు హరీశ్ రావు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ రావు సమావేశంలో పాల్గొనకుండానే బయటకు వచ్చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తామని, అయితే అది పేలవంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ మిగిలిందన్న ఆయన...వృద్దులు, వికలాంగులకు, ఆసరా పింఛన్ దారులకు, మహిళలకు...గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించిందన్నారు. పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం వల్ల రైతాంగానికి నిరాశే మిగిలిందన్న ఆయన...ప్రజలకు ఏలాంటి విశ్వాసం కల్పించలేదన్నారు.  పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదని...మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదని హరీశ్ రావు విమర్శించారు.

నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదన్న ఆయన...ప్రజా వాణి తుస్సుమందని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తారని చెప్పారని...మంత్రులు, ఐఎఎస్ లు కూడా లేరని... చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ చేత చెప్పించారన్న హరీశ్ రావు...ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 ఉన్నాయని... రెండు అమలు చేసి మొత్తం చేసినట్లు చెబుతున్నారని విమర్శించారు. 

10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంచడంలో లోపం ఉందన్న హరీశ్ రావు.. ఈ కారణం చేతనే ఆ విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదన్నారు. డిసెంబర్ 9 నాడు ప్రమాణం చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని...ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముందు చేసి, ప్రజల హామీ మాత్రం వాయిదా వేశారని  మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించిన హరీశ్ రావు....వంద రోజుల్లో 60 రోజులు పూర్తి అయ్యాయని...40 రోజులే ఉన్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో ఉండేదన్న ఆయన.. దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు.

గవర్నర్ ప్రసంగం అంటే ఏడాదికి విజన్ డాక్యుమెంట్ లాంటిదని...500 రూపాయలకే గ్యాస్, కరెంట్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్నారని...వీటి గురించి మాత్రమే చెప్పారని తెలిపారు. అంటే మిగతా హామీలు వచ్చే ఏడాదిలో చేయలేమని చెప్పకనే చెప్పారన్న మాజీ మంత్రి... వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులు ఎత్తేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల కాలంలో రైతులకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారన్న హరీశ్ రావు, వచ్చే యాసంగి పంటకు అయినా బోనస్ ఇస్తారని అనుకుంటే...నిరాశే ఎదురైందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget