By: ABP Desam | Updated at : 12 Mar 2023 09:29 PM (IST)
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై
Governor Tamilisai Wish Telangana CM KCR speedy recovery: తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏఐజీ డాక్టర్లు సీఎం కేసీఆర్ కు ఎండోస్కోపి, సీటీ స్కాన్ చేశారు. దాదాపు 7 గంటలపాటు ఆసుపత్రిలోనే ఉన్న సీఎం కేసీఆర్, రాత్రి ఏడు గంటల తరువాత ఆసుపత్రి నుంచి ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు. కేసీఆర్ కు కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
Wish honb Chief Minister #KCR garu @TelanganaCMO speedy recovery & get well soon
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 12, 2023
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు వైద్యులు. సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఆస్పత్రికి వెళ్లారు. ముఖ్యమంత్రి ఏఐజీ ఆసుపత్రిలో చేరికపై ఆసుపత్రి వర్గాల ప్రకటన చేశాయి. సీఎం కేసీఆర్ కు ఆదివారం ఉదయం పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడిందని, దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్ కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి వైద్య పరీక్షలు చేశారు. సీఎం కేసీఆర్ కు సీటీ ఎండోస్కోపీ టెస్టులు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కడుపులో చిన్న పుండు ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. సీఎం ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉందని, ప్రాథమికంగా కొన్ని మందులు రిఫర్ చేశామని వైద్యులు తెలిపారు.
అంతకుముందు ప్రగతిభవన్‌లో ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం దిల్లీలో జరిగిన ఈడీ విచారణ, ఈ నెల 16న మరోసారి విచారణ గురించి ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ జరిగిన తీరు గురించి కవిత కేసీఆర్ కు వివరించారు. ఈడీ విచారణ జరిగిన తీరును కేసీఆర్‌కు కవిత సుదీర్ఘంగా తెలియజేశారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరవ్వాల్సి ఉండడంతో పలు అంశాలు చర్చించారు. విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.
Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల
RRB Group D Result: రైల్వే 'గ్రూప్-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
గ్రీన్ హైదరాబాద్ దిశగా కీలక అడుగులు - GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలివే!
Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!