Jagga Reddy: భవిష్యత్ లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను, పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటిస్తానన్న జగ్గారెడ్డి
Sangareddy News: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనన్నారు.

Jaggareddy Comments In Sangareddy : కాంగ్రెస్ (Congress ) సీనియర్ నేత, సంగారెడ్డి (Sangareddy) మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని, పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటిస్తానని వెల్లడించారు. సంగారెడ్డిలో తాను ఓడిపోతున్న విషయం ఆరు నెలల ముందే తెలుసని, ఇదే విషయాన్ని అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిసెంబరు ఒకటో తేదీనే చెప్పానన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని, పార్టీని బల పర్చేందుకు రాష్ట్రమంతా పర్యటిస్తానని రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభకు పోటీ చేయాలని ఆసక్తి లేదన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

