By: ABP Desam | Updated at : 27 Apr 2023 01:18 PM (IST)
సొమేష్ కుమార్ (file Photo)
తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది. ఆయన పెట్టుకున్న వీఆర్‌ఎస్‌కు డీవోపీటీ ఓకే చెప్పింది. ఎప్పటి నుంచో కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న సోమేష్ కుమార్ ఇప్పుడు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారనే ఆసక్తి మాత్రమే ఉంది.
ఈ మధ్య ఔరంగాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తళుక్కున మెరిశారు మాజీ సీఎస్ సోమేష్ కుమార్. అప్పుడే తాను రాజకీయల్లోకి వస్తున్నాను బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నాననే సంకేతాలు ఇచ్చారు. వస్తే ఆయనకు కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనేది కీలకంగా మారింది. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఉన్నత స్థానంలో పని చేసిన వ్యక్తి కాబట్టి ఆ దేశగానే ఆయనకు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు
సివిల్ సర్వెంట్‌గా ఆయన పదవీ కాలంలో 2023 డిసెంబర్ వరకు ఉంది. కానీ సర్వీస్ పూర్తి కాక ముందే వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారు. వీఆర్‌ఎస్ తీసుకున్న తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌కు సలహాదురుగానో.. లేదా ప్రభుత్వ సలహదారుగానో ఉంటారని మరో వాదన ఉంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. కానీ ఆయన క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలో పని చేయడానికి అనుమతి తీసుకున్నారు. దీనిపైనే తెలంగాణ హైకోర్టులో కేసు నడిచింది. చాలా కాలం విచారణ తర్వాత ఆయన్ని ఏపీకి వెళ్లాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పుతో ఈ ఏడాది జనవరి నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. అప్పుడే వీఆర్‌ఎస్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయినా ఏపీ వెళ్లి ఛార్జ్ తీసుకున్నారు. జనవరి 12న సీఎం జగన్‌ను కలిసి పోస్టింగ్ తీసుకున్నారు. అయితే రోజులు గడినప్పటికీ ఆ స్థాయికి తగ్గ పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంతలో ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని తాజాగా ఆమోదం లభించింది.
తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Vande Bharat Express: సికింద్రాబాద్ -నాగ్ పూర్ మధ్య వందే భారత్ రైలు, త్వరలోనే అందుబాటులోకి!
Top 5 Headlines Today: బీజేపీలో ఉండలేమంటున్న నేతలు, మరికొంత సమయం కావాలంటున్న వైసీపీ
Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు - యజమాని అరెస్టు
Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?