అన్వేషించండి

Bhatti Vikramarka: మా గ్యారెంటీల సంగతి సరే, పదేళ్లలో మీరేం చేశారు - బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం

Telangana Budget 2024 : తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో భట్టి మాట్లాడారు.

Bhatti Vikramarka:గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇవ్వడం తప్పా?. మహిళలను ఆదుకోవడం తప్పా?. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం తప్పా?. మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్‌ఎస్‌ ఏం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు.  మేము పెట్టిన పీపుల్స్ మార్చ్ బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలు సానుకూలంగా స్పందిస్తారని ఆశించానన్నారు. బడ్జెట్ బాగుంది.. బాగాచేశారు. ప్రజల కోసం మీరు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ బాగా కష్టపడుతోందని అంటారని ఆశించా అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

మీరు ఇప్పుడే వచ్చారు.. ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉంది. మీకు సమయం ఇస్తున్నాం అనే ఆలోచన చేస్తారని అనుకున్నా. కానీ కాంగ్రెస్ మీద దాడి చేయడం తప్ప హరీష్ రావు మాట్లాడిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు పాలన చేని అంతిమంగా మీరు చెప్పిన ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. మేము తక్కువ కాలంలోనే చాలా పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. తాము రైతన్నల గురించి ఆలోచన చేసి రూ.72,659 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించాం. హైదరాబాద్ నగరాభివృద్ధి , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కింద రూ.15,594 కోట్లు ఇచ్చాం. ఎస్సీ సబ్ ప్లాన్ గురించి రూ. 33124 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.1,756 కోట్లు కేటాయించాం. మాది రియలిస్టిక్ బడ్జెట్ అని భ‌ట్టి విక్ర‌మార్క‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు.


20 ఏళ్లు మేమే ఉంటాం
రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందన్నారు. దేశం గర్వించేలా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లు  ఎస్సీ, ఎస్టీ నిధులను పక్కదారి పట్టించిందన్నారు.  ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్​ స్కిల్​ డెవలప్​ మెంట్​ సెంటర్లు ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని   మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్నది అక్షరాల తప్పుడు ప్రచారమని భట్టి విక్రమార్క మండిపడ్డారు.  పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయకుండా వెళ్లినవారు ఇప్పుడు మాపై మాటల దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది నెలలే అయ్యిందని అందులో మూడు నెలలు ఎన్నికల కోడ్‌లోనే గడిపోయిందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లుగా బడ్జెట్ ఊహాజనితంగా ఎక్కడుందంటూ ప్రశ్నించారు.

హైదరాబాద్ కోసమే రూ.10వేల కోట్లు
వ్యవసాయం కోసం రూ.72 వేల కోట్లు కేటాయించడం తప్పా.? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయించడం తప్పా అని ప్రతిపక్షాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కోసం బడ్జెట్‌లో రూ. 17,056 కోట్లు , మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 30 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామంటూ గుర్తు చేశారు. మరో 35 వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని, నాలుగు నెలల్లోనే 65 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే అన్నారు. రుణమాఫీపై కొందరు ఎగతాళి చేశారని..  ఎంత కష్టమైనా రుణమాఫీపై ముందుకెళ్తుతున్నామని గుర్తు చేశారు.

రైతు కూలీలకు రూ.12వేలు 
 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ఈ ఏడాది నుండే ఇస్తామన్నారు. త్వరలో స్పష్టమైన విద్యుత్​ పాలసీని అమలు చేస్తామన్నారు.  2035 వరకు విద్యుత్​ పాలసీని సిద్ధం చేశామని ఉపముఖ్యమంత్రి అన్నారు.  ఏదో ఐదేళ్లు గడిపేయడానికి మేం అధికారంలోకి రాలేదని, తమ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందన్నారు.  దేశం గర్వించేలా తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను తీసుకువస్తామన్నారు. దాదాపు 20 నుండి 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థుల తయారు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  తెలంగాణ నూతన విద్యా విధానం దేశానికి ఆదర్శం కాబోతుందన్నారు.

ప్రతి ఒక్కరికి సొంతిల్లు
ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. త్వరలోనే 4.5  లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామన్నారు. గ్యారంటీలను అమలు చేసేందుకు మంత్రులందరూ కష్టపడి చేస్తున్నారని భట్టి అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా స్కిల్​ డెవలప్​ మెంట్​ యూనివర్శిటీకి రూపకల్పన చేశామన్నారు. రైతు భరోసా అమలులో ప్రజాధనం వృథా కాకూడదనే.. రైతుల నుంచి సలహాలు తీసుకుంటున్నామన్నారు. పదేళ్లుగా పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.  తమ ప్రభుత్వంలో 16వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించినట్లు వివరించారు. అభివృద్ధి చర్యల ఫలాలు ఐదు, పదేళ్ల తర్వాత కనిపిస్తాయని ఉద్ఘాటించారు.  

బీఆర్ఎస్ వి అన్ని మోసాలే
బీఆర్ఎస్ పార్టీ ఏమి చేప్పింది?? ఏమి చేసిందో అందరికీ తెలుసని భట్టి విక్రమార్క అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు.. చేశారా?.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా?  ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా? ప్రతి మండలంలో  బాలురుకు, బాలికలకు ప్రత్యేకంగా రెండు నుంచి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ కడతామని చెప్పారు.. కట్టారా?? అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలకు గురించి చెప్పాల్సిన పనిలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ప్రతి గ్యారంటీనీ అమలు చేసేందుకు తపిస్తున్న ప్రభుత్వం మాది. ప్రభుత్వంలోని ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారివారి కార్యలయాల్లో సమీక్షలు నిర్వహిస్తూ.. పనిచేస్తున్నారు. గ్యాస్ సిలండర్ ను రూ. 500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Senyar: తుపాన్‌గా బలపడిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
తుపాన్‌గా మారిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
SI Gun Missing: సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన ఎస్ఐ! అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్.. ట్విస్ట్ ఏంటంటే..
సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన అంబర్‌పేట ఎస్ఐ! అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్.. ట్విస్ట్ ఏంటంటే..
India Slams China: చైనా మాటలు లెక్కచేయం.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
చైనా మాటలు లెక్కచేయం.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Bigg Boss 8 Winner Nikhil: ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'
ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'
Advertisement

వీడియోలు

Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
దూకుడుగా రాజకీయాలు చేసి దారుణంగా దెబ్బతిన్నా: అన్నామలై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Senyar: తుపాన్‌గా బలపడిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
తుపాన్‌గా మారిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
SI Gun Missing: సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన ఎస్ఐ! అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్.. ట్విస్ట్ ఏంటంటే..
సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన అంబర్‌పేట ఎస్ఐ! అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్.. ట్విస్ట్ ఏంటంటే..
India Slams China: చైనా మాటలు లెక్కచేయం.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
చైనా మాటలు లెక్కచేయం.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Bigg Boss 8 Winner Nikhil: ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'
ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'
Top 5 Scooters With 125cc: స్కూటీ కొనాలని చూస్తున్నారా? 125cc ఇంజిన్‌తో టాప్ 5 మోడల్స్, వాటి ధరలు
స్కూటీ కొనాలని చూస్తున్నారా? 125cc ఇంజిన్‌తో టాప్ 5 మోడల్స్, వాటి ధరలు
India vs South Africa 2nd Test: భారత్‌ను మోకాళ్ల మీద నిలబెడతాం.. రెండో టెస్ట్ ఫలితంపై దక్షిణాఫ్రికా కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్‌ను మోకాళ్ల మీద నిలబెడతాం.. రెండో టెస్ట్ ఫలితంపై దక్షిణాఫ్రికా కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra farmers: మామిడి, ఉల్లి  ఇప్పుడు అరటి - ఏపీలో రైతుల పంటలకు దక్కని గిట్టుబాటు ధర - ప్రభుత్వం ఏం చేస్తోంది?
మామిడి, ఉల్లి ఇప్పుడు అరటి - ఏపీలో రైతుల పంటలకు దక్కని గిట్టుబాటు ధర - ప్రభుత్వం ఏం చేస్తోంది?
Nara Lokesh: జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో- లోకేష్‌ సీరియస్- గౌరవంగా ఉండాలని సూచన  
జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో- లోకేష్‌ సీరియస్- గౌరవంగా ఉండాలని సూచన  
Embed widget