Cost of living in Hyderabad: హైదరాబాద్‌లో బతకాలంటే ఎంత సంపాదన ఉండాలి?
Family Expenditure in Hyderabad: హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత..? భాగ్యనగరంలో ఒక కుటుంబం జీవించాలంటే.. ఎంత సంపాదన ఉండాలి..? తాజా నివేదికలు ఏం చెప్తున్నాయి?
Cost of living For Bachelor in Hyderabad: హైదరాబాద్.. ఓ మహానగరం. వేగంగా అభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందినవారు సైతం హైదరాబాద్‌లో స్థిరపడుతున్నారు. వాతావరణం పరంగా, వ్యాపారం పరంగా.. ఐటీ ఉద్యోగాల పరంగా హైదరాబాద్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే, హైదరాబాద్‌లో నివాసం ఉంటే ఖర్చు ఎంత అవుతుంది..? మిగతా మహానగరాలతో పోల్చుకుంటే...? హైదరాబాద్‌లో ఒక కుటుంబం బతకడానికి ఎంత సంపాదన ఉండాలి..? ఈ ఏడాదికి సంబంధించి చేసిన తాజా సర్వేలు ఏం చెప్తున్నాయి..?
దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్‌లోనే ఖర్చు తక్కువే. కుటుంబ జీవన వ్యయంతోపాటు ఇంటికి అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే... పుణె, కోల్‌కతా తర్వాత స్థానంలో భాగ్యనగరం ఉంది. మిగతా నగరాలతో పోలిస్తే ఇళ్ల ధరలు కూడా హైదరాబాద్‌లోనే తక్కువ. ముంబైతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఇళ్ల ధరలు, అద్దెలు చాలా ఎక్కువ. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో జీవన వ్యయం కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని సర్వేలు చెప్తున్నాయి. మానవ జీవనానికి అవసరమైన అన్ని ముఖ్యమైన సౌకర్యాలను అందించే అత్యుత్తమ నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ వాతావరణం బాగుటుంది. హైదరాబాద్ వాతావరణాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు ఇష్టపడతారు.
కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను అంచనా వేసేందుకు.... ఉద్యోగం లేదా వృత్తి, బ్యాచ్‌లరా..? కుటుంబమా..? అనేది కూడా లెక్కలోకి తీసుకుంటారు. వారి ఆర్థిక స్థితి, జీవనశైలి, ఖర్చులు వంటివి ఆధారంగా అంచనాలు వేస్తారు. ఆయా ప్రాంతాల్లో ఆస్తుల విలువ.... విద్య, ప్రయాణ, ఇంధన, ఆహార ఖర్చులు, మౌలిక సదుపాయాల వివరాలు తీసుకుని సర్వేలు నిర్వహిస్తారు. ఈ సర్వేల ప్రకారం... హైదరాబాద్‌లో జీవన వ్యయం ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల కన్నా తక్కువనే చెప్పాలి. ఉదాహరణకు... హైదరాబాద్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు... సుమారుగా 7వేల రూపాయలకే అద్దెకు లభిస్తాయి. అలాగే.. కరెంటు బిల్లు 2వేలు, వైఫైకి వెయ్యి, కిరాణా ఖర్చులు, రవాణా . ఇలా అన్ని ఖర్చులు చూసుకున్నా... నెలకు 20వేల రూపాయలు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. మనం ఎంచుకునే ప్రాంతం, అపార్ట్‌మెంట్‌ను బట్టి ఖర్చులు పెరుగుతాయని చెప్తున్నారు.
బ్యాచిలర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్
హైదరాబాద్ బ్యాచిలర్స్ ఉండేందుకు ఇల్లు కావాలంటే... 8 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు, ముగ్గులు ఇలా కలిసి ఉంటే... అద్దె ఖర్చులు పంచుకునే అవకాశం ఉంది. ఇంటి ఖర్చలు కోసం 4వేల రూపాయలు అవుతుంది. రవాణా ఖర్చులు అయితే... బ్యాచ్‌లర్స్ ప్రజా రవాణా వాడుకోవచ్చు. అప్పుడు ఖర్చు 2వేలకు మించదు. అదే కారులో ప్రయాణిస్తే ఖర్చు పెరుగుతుంది.
పని చేసే జంటలకు..
హైదరాబాద్‌లో ఒక జంట నివాసం ఉండేందుకు సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు సరిపోతుంది. దీనికి అద్దె నెలకు రూ.8 నుంచి రూ.10 వేలు ఉంటుంది. అంతేకాకుండా... కపుల్స్ కు విద్యుత్, ఇంటర్నెట్, వంట గ్యాస్ ఇలా ఇరత్రా ఇంటి ఖర్చల కోసం డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు రూ.10,000వేల వరకు ఉంటాయి. ఇక రవాణా కోసం రూ.2వేలపైనే ఖర్చు చేయాల్ని ఉంటుంది.
నలుగురు సభ్యులున్న కుటుంబం అయితే..
బ్యాచ్‌లర్స్, కపుల్స్‌తో పోలిస్తే... నలుగురు సభ్యులున్న కుటుంబం ఖర్చు అధికంగా ఉంటుంది. పిల్లల విద్య, ఆహారం, ప్రయాణం, వైద్యం కోసం అదనపు ఖర్చులు ఉంటాయి. దీని బట్టి నలుగురు సభ్యులున్న కుటుంబం హైదరాబాద్‌లో జీవించాలంటే సుమారుగా రూ.30,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ. 25,000 బడ్జెట్ సరిపోతుందని చెప్తున్నారు. అయితే... డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కావాలనుకుంటే మాత్రం అద్దె నెలకు 15వేలు ఉంటుందని.. దాన్ని బట్టి ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్తున్నారు.
ఇలా చూస్తే.. హైదరాబాద్ ఒక బ్యాచ్‌లర్‌కు నెలకు సుమారుగా 18వేల రూపాయలు. అయితే, కపుల్‌కు 22వేలు, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి 40వేల చొప్పున ఖర్చవుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే... భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన 4వ నగరం హైదరాబాద్. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులుతోపాటు అనేత మతాల వారు హైదరాబాద్‌లో ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇది చక్కని ఉదాహరణ. హైదరాబాద్ ప్రజలను హైదరాబాదీలు అని కూడా అంటారు. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో నేరాల రేటు తక్కువగా ఉంది. వీటన్నింటిని బట్టి హైదరాబాద్ బెస్ట్ లివింగ్ ప్లేస్ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.