By: ABP Desam | Updated at : 17 Mar 2023 01:00 PM (IST)
సికింద్రాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు - నిత్యం టెన్షన్ టెన్షన్
Secunderabad Fire Accidents: సికింద్రాబాద్ పరిధిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. గురువారం స్వప్నలోక్ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించడంతో అసలు అగ్ని ప్రమాదాలకు కారణాలపై చర్చ సాగుతోంది. అగ్నిప్రమాదాలు జరిగిన అన్ని చోట్లా అక్రమ గోదాములే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. డెక్కన్ మాల్ ఘటన తర్వాత అగ్ని ప్రమాదాల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు.
ముందు జాగ్రత్తలేవీ..?
బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతికి కారణం గోడౌనే.. సెప్టెంబర్‌లో రూబీ లాడ్జిలో ప్రమాదం జరిగి 8 మంది మృతి చెందగా.. బ్యాటరీ గోదామే కారణమైంది. డెక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంటల్లో ముగ్గురు సజీవ దహనానికి కారణం గోడౌనే. ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నికీలలు చెలరేగడానికి కారణమూ గోదామే. ఫైర్‌సేఫ్టీ మచ్చుకైనాలేని చోట ప్రాణాలను మింగేస్తున్న గోడౌన్లు. కమర్షియల్ కాంప్లెక్సుల్లోనూ గోదాముల నిర్వహణతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలే తప్ప.. పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చొరవ చూపడంలేదు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర పరిస్థితుల్లో వ్యాపారాలు సాగుతున్నా.. కఠినంగా వ్యవహరించటంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతోంది.
తూతూమంత్రం చర్యలే..!
గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దిశగా చర్యలు తీసుకోలేదు. వరుస ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లోనైనా చర్యలు శూన్యం. అనుమతి లేని అంతస్తులు, గృహ అవసరాల కోసం నిర్మించిన ఇళ్లు భారీగా వ్యాపార సముదాయాలుగా మారడం, రోడ్ల ఆక్రమణ జరుగుతున్నా బల్దియా అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. స్థానికంగా కొందరు కిందిస్థాయి అధికారులకు ఆమ్యామ్యాలు అందుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాదం జరిగాక హడావుడి చేయడం కన్నా.. ముందే అప్రమత్తమైతే ప్రాణాలతో పాటు ఆస్తినష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్ పేపర్' విషయంలో కీలక నిర్ణయం!
TSPSC Paper Leak SIT : గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127, 122 మార్కులు- మరో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్టు!
Telangana weather report: పగలంతా ఎండలు, సాయం కాలం వానలు - రానున్న ఐదురోజులు తెలంగాణలో వెదర్ ఇలా!
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ