Telangana Crime News: ప్రాణం తీసిన షేర్‌మార్కెట్- కోటి రూపాయులు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
Telangana Crime News: ఆర్థిక ఇబ్బందులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి అప్పులు తీర్చే దారి లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.

Telangana Crime News: హైదరాబాద్‌లోని మాదన్నపేటలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చే దారి లేక కుటుంబాన్ని నడిరోడ్డుపై వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూర్యపేటకు చెందిన ఏ. వెంకటేశ్వర్లు మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అంబర్‌పేట్ దుర్గానగర్‌లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. నష్టాలే చవిచూశాడు. ఇలా వేలలు, లక్షల్లో కాదు కోటి రూపాయలు అప్పులు పాలయ్యాడు.
వస్తున్న జీతానికి తాను చేసిన అప్పులకు ఎలాంటి పొంతన లేకుండా పోయింది. కనిపించిన చోటల్లా అప్పులు తీసుకుంటూ వెళ్లాడు. చివరకు అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువైంది. వాటిని ఎలా తీర్చాలో తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చున్నీతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
అనారోగ్యంతో వ్యక్తి సూసైడ్
రంగారెడ్డి జిల్లాలో కేశంపేట, అలియాబాద్‌లో కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నాడు. కేశంపేటలో తాగుడు అలవాటు ఉన్న గుంటి ఆంజనేయులు అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. తాగుడుకు బానిగా మారడంతోపాటు కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఉండటంతో వాటిని భరించలేక సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లోనే మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి చనిపోయాడు. గమనించి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. పరీక్షించిన వైద్యులు తీసుకొచ్చే సరికే చనిపోయినట్టు వెల్లడించారు.
భర్త లేని సమయంలో భార్య సూసైడ్
శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో కూడా పాతికేళ్ల భీమిరెడ్డి పావని సూసైడ్ చేసుకుంది. భర్త ఇంట్లో లేని టైంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

