అన్వేషించండి

CM Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు, అన్ని వ్యవస్థలను గాడిన పెడుతున్నాం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు, అన్ని వ్యవస్థలను గాడిన పెడుతున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

Telangana formation Day | హైదరాబాద్: విద్యార్థులు, యువకులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకలజనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు నేడు, నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుభాకాంక్షలు తెలియజేశారు. గత పదేళ్లలో గాడితప్పిన వ్యవస్థలను గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజా ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.  రాష్ట్ర ప్రజల కలను నిజం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. 

పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చర్యలు చేపట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని, ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు అన్నారు.  

ప్రక్షాళన చేపట్టాం..

గత పదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (TGPSC)ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, HRC సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం’ అన్నారు.  

కోటిశ్వరులుగా ఆడబిడ్డలు..

‘కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పం తీసుకున్నాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. అదానీ, అంబానీలతో పోటీ పడేలామహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం.  పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. వారి ఉత్పత్తులను విక్రయించేందుకు హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశాం. 

మహిళల కోసం ప్రభుత్వం కార్యక్రమాలు..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సలు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని చూస్తున్నాం. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు  ఇస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. 

రైతుల కోసం పథకాలు

రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం ఎనిమిది నెలల్లో 25లక్షల, 35వేల,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నాం. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని  ఎకరాకు రూ.12వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి  ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నాం. 

వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. దీంతో 275 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్రవ్యాప్తంగా 8వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ యజమానులకు భరోసా కల్పిస్త్నున్నాం. 

అధికారంలోకి వచ్చిన16నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి,  నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాం. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం.వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం.

విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం

మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని కమిషన్ ను ఆదేశించాం. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్ లో మెస్ చార్జీల సమస్యను పరిష్కరించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా డైట్ చార్జీలను 40శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువస్తున్నాం. 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలను నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. 

రిజర్వేషన్లు, కుల గణన
బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాలలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. శాస్త్రీయంగా కులగణన నిర్వహించి బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చాం. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతున్నాం. శాసనసభ ,శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఎస్సీ ఉపకులాలవర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టన్నాం. ఎస్సీ ఉప కులాను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించాం

నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. నియోజకవర్గానికి 3500 ఇండ్లు. రూ.22,500 కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతాం. మే 20 నాటికి 5,364 ఇందిరమ్మ లబ్దిదారులకు 53కోట్ల 64లక్షల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమచేసాం. తెలంగాణలో మూడు కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. 

 దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటనల ద్వారా 3లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్.సీ.ఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ లో ఇదొక తొలి మెట్టు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - రిలీజ్‌కు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Mobile Recharge Price : మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
Embed widget