అన్వేషించండి

Revanth Reddy vs Amit Shah: "మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి గెలవండి" అమిత్‌ షాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

Revanth Reddy vs Amit Shah: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి గెలిచి చూపించాలని అమిత్‌ షాకు సీఎం రెవంత్ రెడ్డి సవాల్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విద్వేష ప్రసంగాలపై కఠిన చట్టం, శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యత.
  • మైనారిటీల అండదండలు మరువలేనివి, కాంగ్రెస్ ఎల్లప్పుడూ సముచిత స్థానం కల్పిస్తుంది.
  • అమిత్ షా సవాల్, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తే తెలంగాణలో గెలవాలి.
  • రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో, మైనారిటీలు విద్యావంతులు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష.

Revanth Reddy vs Amit Shah: తెలంగాణ గడ్డపై విద్వేష రాజకీయాలకు తావులేదని, శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జమియర్ ఉలమా యే హింద్‌ సంస్థ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర భవిష్యత్తు, మైనారిటీల హక్కులకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా సమాజంలో చిచ్చు పెట్టే విద్వేష ప్రసంగాలను నియంత్రించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు వెల్లడించి సంచలనం సృష్టించారు. 

భారత్‌ స్వాతంత్య్ర పోరాటంలో జమియత్ ఉలమా సంస్థ పోషించిన పాత్రను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. దేశ విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీతో భుజం భుజం కలిపి పోరాడిన చరిత్ర ఈ సంస్థకు ఉందని ఆయన గుర్తు చేశారు. దేశంలో మెజారిటీ, మైనారిటీ ప్రజలు సోదరభావంతో కలిసి ముందుకు సాగడానికి జమీయత్ నిరంతర కృషి చేస్తోందని అభినందించారు. తన వ్యక్తిగత రాజకీయ ఎదుగుదలలో కూడా ఈ సంస్థ పాత్రను ఆయన స్మరించుకున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు  హిందువులతోపాటు ముస్లింలు తనను ఆశీర్వదించి గెలిపించారని, తాను గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి తోడుగా మోదీ, అమిత్‌ షాపై పోరాడటానికి ఆనాటి సహకారమే పునాది అని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మైనారిటీల అండదండలు మరువలేనివని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజాం పాలనపై షోయబుల్లా ఖాన్ వంటి నేతలు చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీ నేతలకు సముచిత స్థానం కల్పిస్తోందని చెప్పారు. జాతీయ స్థాయి సల్మాన్ ఖుర్షిద్, అహ్మద్‌ పటేల్ వంటి నేతలు అగ్రశ్రేణి నాయకులుగా ఎదిగారని, రాష్ట్రంలో కూడా అజారుద్దీన్, షబీర్ అలీ వంటి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చామని వివరించారు. అజారుద్దీన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ఆయనపై నమ్మకంతో ఎంఎల్‌సీగా అవకాశం ఇచ్చి, మంత్రిని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే 8 కార్పొరేషన్ల బాధ్యతలను మైనారిటీ నేతలకే అప్పగించామని, పార్టీ టికెట్లు ఇచ్చినప్పుడు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. 

రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్వేష ప్రసంగాల వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని, దీనిని అరికట్టడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురాబోతున్నామని, దేశం అభివృద్ధి చెందాలంటే అంతా కలిసిమెలిసి ముందుగా సాగాలి అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా శాంతియుత వాతావరణం అవసరమని ఆయన గుర్తు చేశారు. ఏ ఒక్కరి వల్ల దేశం అభివృద్ధి చెందదని అందరి భాగస్వామ్యం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

మైనారిటీలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్రమంత్రి అమిత్‌ షా చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్‌ షాకు దమ్ముంటే ఆ మాట చెప్పి తెలంగాణలో గెలిచి చూపించండి అని ఆయన బహిరంగ సవాల్ చేశారు. ఒక పార్టీ తన ఓట్లను అవయవ దానం చేయడం వల్ల బీజేపీ ఓట్ల శాతం పెరిగి ఉండవచ్చని అంత మాత్రాన తెలంగాణ కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించలేరని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు కేసు సుప్రీం కోర్టులో ఉందని తమ  ప్రభుత్వం దీనిపై అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనలో మైనారిటీల జనాభాను కూడా శాస్త్రీయంగా లెక్కించామని, ఈ గణాంకాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని, మైనారిటీలు విద్యావంతులు కావాలని ఆయన కోరారు. పదవులు ఎల్లకాలం ఎవరికీ ఉండవని, ఉన్నంత కాలం ప్రజల కోసం పని చేయడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Frequently Asked Questions

తెలంగాణలో విద్వేష రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని స్పష్టం చేశారు?

తెలంగాణ గడ్డపై విద్వేష రాజకీయాలకు తావులేదని, శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

విద్వేష ప్రసంగాలను నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది?

సమాజంలో చిచ్చు పెట్టే విద్వేష ప్రసంగాలను నియంత్రించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

మైనారిటీల రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు?

మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే ఆ మాట చెప్పి తెలంగాణలో గెలిచి చూపించాలని ఆయన సవాల్ చేశారు.

మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పించింది?

మైనారిటీ నేతలకు సముచిత స్థానం కల్పిస్తూ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పలువురికి ఉన్నత పదవులు కల్పించారు. 8 కార్పొరేషన్ల బాధ్యతలను కూడా మైనారిటీ నేతలకే అప్పగించారు.

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget