![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KCR Dasara: ప్రగతి భవన్లో దసరా వేడుకలు, నల్ల పోచమ్మకు కేసీఆర్ ప్రత్యేక పూజలు
ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోశ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![KCR Dasara: ప్రగతి భవన్లో దసరా వేడుకలు, నల్ల పోచమ్మకు కేసీఆర్ ప్రత్యేక పూజలు CM KCR participates Dasara celebrations in Pragathi Bhavan of Hyderabad KCR Dasara: ప్రగతి భవన్లో దసరా వేడుకలు, నల్ల పోచమ్మకు కేసీఆర్ ప్రత్యేక పూజలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/1302116a32960332ddbf80c5ce0fef881698056380736234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోశ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.
శుభసూచకంగా భావించే పాలపిట్టను సీఎం దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం దసరానాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని సీఎం పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరకీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.
కేటీఆర్ విజయ దశమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విజయదశమి స్ఫూర్తితో మీరు చేసే మంచి పనులన్నింటిలో విజయం కలగాలని ఆశిస్తున్నానని కేటీఆర్ అన్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)