Hyderabad News: హైదరాబాద్‌లో విషాదం- రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి చిన్నారులు మృతి
Telangana News: హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రహరీ గోడ కూలి చిన్నారులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Hyderabad Rains : చిన్న పాటి వర్షానికే పెనుప్రమాదం జరిగింది. ముక్కుపచ్చలారని చిన్నారులు నిద్రలోనే కన్ను మూశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది.
హైదరాబాద్‌లోని రాజేందర్ నగర్‌లో బాబుల్ రెడ్డి కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటి ప్రహరీ గోడ కూలింది. అక్కడే నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రహరీగోడ కూలి ఇంట్లో పడటంతో ఎనిమిదేళ్ల నూర్‌జన్, మూడేళ్ల ఆసిఫ్ పర్వీన్ స్పాట్‌లోనే చనిపోయారు. గాయపడ్డ ఇద్దర్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గోడ కూలిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే గోడ శిథిలాల కింద చిన్నారులిద్దరు నలిగిపోయి ప్రాణాలు వదిలేశారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపిందిం.
నిన్నటి వర్షాలకు వికారాబాద్‌లో కూడా పెద్ద ప్రమాదం తప్పింది. బంట్వారం మండలంలోని నాగవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వర్షాలకు ఓ వాగు ఉప్పొంగింది. అదే టైంలో అటు నుంచి వస్తున్న కారు అందులో ఇరుక్కుపోయింది. కారు టాప్ మాత్రమే కనిపించే పరిస్థితి ఉంది. దీంతో అందులో ఉన్న వాళ్లు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు.