News
News
X

హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్- ట్రిపుల్ ఆర్‌కు గ్రీన్‌సిగ్నల్

మొదట రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి మాత్రమే అనుమతి ఇచ్చిన కేంద్రం.. దక్షిణ భాగం విషయంలో సైలెంట్ గా ఉండటంతో...ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

FOLLOW US: 

ఔటర్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ రేంజ్ మారిపోయింది. అంతకు ముందు మహానగరంలోకి రావాలంటే గంటల తరబడి వేచి చూసిన పరిస్థితులు పూర్తిగా ఛేంజ్ అయిపోయాయి. పైగా ఓఆర్ఆర్ చుట్టూ జరిగిన డెవలప్ మెంట్ యాక్టివిటీస్ కారణంగా హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరించింది. ఇప్పుడు అంతే ప్రతిష్ఠాత్మకంగా రీజినల్ రింగ్ రోడ్డు ను కూడా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ఏంటీ రీజినల్ రింగ్ రోడ్డు :
హైదరాబాద్‌కు చుట్టూ 60- 70 కిలోమీటర్ల అవతల... తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రింగ్ రోడ్ నిర్మించాలనేది ప్లాన్. దీన్నే రీజనల్‌ రింగ్‌ రోడ్ RRR అంటున్నారు. ఈ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ స్థాయి ఫలితాలను ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

ఎవరి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయ్ :
నార్త్ అండ్ సౌత్ ఫేజ్ లుగా RRRను నిర్మించాలనేది ప్లాన్. రెండు ఫేజ్‌లకు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కూడా వచ్చేసింది. హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించేప్పుడు ఓ కన్సల్టెన్సీతో టెంపరరీ అలైన్ మెంట్ ను గతంలో రూపొందించి పంపించింది. మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌ రోడ్డు ఉంటుందని అందులో ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డులోని 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి కి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని NHAI నుంచి ఆదేశాలు అందాయి.

నార్త్ సైడ్ RRR లో ఏమేం ప్రాంతాలు ఉంటాయంటే :
సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్‌ వరకు.. సుమారు 160 కిలోమీటర్లు ఉండాలి అనుకుంటున్నారు. నిర్మాణం కోసం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్‌–1 లో ఈ పనులు చేపట్టాలని చూస్తున్నారు. ఈ రోడ్డుకు తాత్కాలికంగా జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 166ఏఏ అని నెంబర్ ఇచ్చారు. నాగ్‌పూర్‌కు చెందిన కే అండ్‌ జే ప్రాజెక్ట్స్‌ సంస్థ ఈ భాగానికి కన్సల్టెన్సీ సంస్థగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో టెండర్‌ ద్వారాసంస్థను ఎంపిక చేశారు. ఏడాదిలోగా అలైన్‌మెంట్‌ పూర్తి చేసి, భూసేకరణకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణానికి మొత్తంగా రూ.9,500 కోట్లకుపైగా ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.

సౌత్ సైడ్ RRR లో ఏమేం ప్రాంతాలు ఉంటాయంటే :
సంగారెడ్డి నుంచి కంది,నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్‌ నారాయణపూర్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు.. దాదాపు 182 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ సౌత్ సైడ్ రింగ్ రోడ్. భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్‌2 కింద గుర్తించారు. ఢిల్లీకి చెందిన ‘ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించారు. నిర్మాణానికి మొత్తంగా రూ.15 వేల కోట్లకుపైగా ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.

భూసేకరణ ఎలా చేస్తారు :
భూసేకరణలో భాగంగా 3ఏ గెజిట్లను విడుదల చేసింది రాష్ట్రప్రభుత్వం.  విడుదల వరకు కసరత్తు పూర్తి చేసింది. భూసేకరణ అధీకృత అధికారులుగా ఉన్న ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు సంబంధించి ఇటీవలే విడతల వారీగా ఎనిమిది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కూడా.  

సవాళ్లు ఏంటీ..?
కంప్లీట్ గా డీపీఆర్‌ ఫైనల్ అయితే తప్ప ఎంత ఖర్చు అవొచ్చనేది చెప్పటం కష్టం. ఇక సౌత్ సైడ్ కు సంబంధించిన డీపీఆర్‌ తయారీకి రెండేళ్లకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. సో వీలైనంత త్వరగా ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే..ఇటు ల్యాండ్ రేట్లు పెరుగుతాయి కాబట్టి నిర్వాసితులు పరిహారం ఎక్కువ అడుగుతారు. రెండోది నిర్మాణ వ్యవయం కూడా పెరిగిపోతుంది. సో దట్ సౌత్ సైడ్ అప్పటికి 15వేల కోట్ల రూపాయలకు ఖర్చుకు చేరుతుందే ఏమో అని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

మొదట రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి మాత్రమే అనుమతి ఇచ్చిన కేంద్రం.. దక్షిణ భాగం విషయంలో సైలెంట్ గా ఉండటంతో...ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సౌత్ ఫేజ్‌లో ఉన్న రోడ్డు ప్రతిపాదించిన ప్రాంతాల మధ్య ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో.. ఈ వైపు అసలు ఎక్స్‌ప్రెస్‌ వే అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెప్పినట్లు సమాచారం. సో పూర్తి గా రింగ్‌లా కాకుండా ఒన్ సైడ్ మాత్రమే రోడ్ వస్తుందని అనుకున్నారు కానీ.... ఈ ఇయర్ ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. రీజనల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది గడిచి నాలుగు నెలలైనా అనుమతి రాకపోవటంతో.. దక్షిణభాగం ఉంటుందా, లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్న టైంలో కేంద్రం నుంచి అనుమతులు వచ్చేశాయి.

Published at : 07 Sep 2022 09:24 PM (IST) Tags: Hyderabad News Hyderabad ORR Hyderabad RRR

సంబంధిత కథనాలు

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Amalapuram BRS Banners : ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, అమలాపురం ఎంపీ అభ్యర్థి ఆయనేనా?

Amalapuram BRS Banners : ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, అమలాపురం ఎంపీ అభ్యర్థి ఆయనేనా?

Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని

Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!