అన్వేషించండి

గద్దర్ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి- ఎల్‌బీ స్టేడియం వద్ద అభిమానుల బారులు

గద్దర భౌతిక కాయాన్ని ప్రముఖులు సందర్శించి నివాళి అర్పిస్తున్నారు. కాసేపట్లో ఆయన అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

ప్రజాగాయకుడు గద్దర భౌతిక కాయాన్ని చివరి సారిగా చూసేందుకు భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ప్రజలు, అభిమానుల కోసం ప్రజాయుద్ధనౌక పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఉంచారు. ఆయన్ని కడసారి చూసేందుకు వచ్చిన వారితో ఆ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోయింది. 

నీ పాట ఎప్పుడూ మాలో ఉత్సాహాన్ని ఉద్యమ కాకంక్షను రగిలిస్తూనే ఉంటుందని అంటున్నారు గద్దరక్ నివాళి అర్పించే ప్రముఖులు, అభిమానులు. ఎల్పీస్టేడియంలో ఉన్న గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన పాటలు, మాటలను గుర్తు చేసుకున్నారు.  గద్దర లాంటి ఉద్యమకారులు, ప్రజాగాయకుడి మరణం రాష్ట్రానికే చాలా తీరని లోటని బాధని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆశయాలు నెరవేరకుండానే ఆయన కాలం చెందారని బాధపడ్డారు. 

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో చెప్పినట్టు కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాము ఊహించిన తెలంగాణ ఇంకా సాకారం కాలేదని అన్నారని తెలిపారు. మార్పు కోసం మరో ఉద్యమం రావాలని కోరుకున్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే, జానారెడ్డి, కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బూర న్సయ్య గౌడ్‌, గరికపాటి నర్సింహరావు గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా గద్దర్‌ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. 

నా రూమ్‌ మీట్‌: ఎన్వీరమణ 
సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ కూడా ఎల్బీ స్టేడియానికి వచ్చి గద్దర పార్థివ దేహానికి నివాళి అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని గుర్తు చేసుకున్నారు. రిటైర్‌ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనను కోరారని తెలిపారు. 

తెలంగాణ మంత్రులు కూడా గద్దర్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నటుడు మోహన్ బాబు, హాస్యనటుడు అలీ, బండ్ల గణేష్‌, మంచు మనోజ్‌, సింగర్‌ మధు ప్రియ నివాళి అర్పించారు. అన్ని యూనివర్శిటీల నుంచి విద్యార్థులు తరలి వచ్చి అశ్రునివాళి అర్పిస్తున్నారు. గద్దర్ రాసిన పాటలను గుర్తుచేసుకుంటున్నారు. 

అభిమానులు, ప్రముఖులు నివాళి అర్పించిన తర్వాత ఎల్పీస్టేడియంలోని గద్దర్ భౌతిక కాయాన్ని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకొచ్చి కాసేపు ఉంచుతారు. అనంతరం ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ కు గద్దర్ భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రజాగాయకుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద కాసేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అక్కడ అంతిమ లాంఛనాలు పూర్తి చేసి అక్కడి నుంచి శ్మశానవాటికకు తరలిస్తారు. ఈ టైంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. 

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియు నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం తప్పుబడుతోంది. ఇలా చేయడం అంటే పోలీసు అమరవీరులను అవమాన పరిచడమే అంటూ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన వారి త్యాగాలకు విలువ ఏముందని  ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget