BRS Working President KTR: ఒకసారి కాదు వందసార్లు జైలుకు వెళ్లేందుకు సిద్ధం- విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
BRS Working President KTR: ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరవుతున్న టైంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిలదీస్తూనే ఉంటామన్నారు.

BRS Working President KTR: తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. గత వారం కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైన సమాధానాలు చెప్పారు. పార్ములా ఈ రేసు కేసులో విచారణకు మరోసారి హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఇలాంటి విచారణలకు బీఆర్‌ఎస్ బెదిరిపోదని ఎన్ని కుట్రలైనా చేసుకోవాలంటూ సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఒకసారి కాదు వందసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపుల వలన వెనక్కి తగ్గేదేలేదన్నారు. ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో తమను ఇవేవీ ఆపలేవని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటమని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డి అంటూ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ సవాల్ చేశారు.
ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసం ఒకసారి కాదు వందసార్లు అయినా జైలుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఒకటి కాదు వెయ్యి కేసులు పెట్టుకున్నా తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వానికి బీఆర్‌ఎస్ శ్రీరామ రక్ష అని పునరుద్ఘాటించారు.
I will never be deterred by your enquiries, commissions and political vendetta
— KTR (@KTRBRS) June 16, 2025
We @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees
Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP
మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో ఏసీబీ ముందు హాజరు కానున్నారు. పార్ములా ఈ రేసుకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నందున మరోసారి విచారణకు రావాలని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు మేరకు 10 గంటలకు విచారణకు హాజరవుతారు. ఇప్పటికే పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. విచారణకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు నందినగర్‌లోని తన ఇంటి నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు.
కేటీఆర్‌తో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఇందులో నిధుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో ఏసీబీ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో ప్రత్యేకప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెడ్ ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. లండన్‌లో ఉన్న పార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఓను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు.
కేటీఆర్‌ను కూడా ఇప్పటికే ఒకసారి ఏసీబీ అధికారులు విచారించారు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలనీి గతనెల 29న నోటీసులు జారీ చేశారు. తాను విదేశాల్లో ఉన్నందున ఆ తేదీల్లో విచారణకు రాలేకపోతున్నాననీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత దర్యాప్తునకు వస్తాని స్పష్టం చేశారు. దీంతో ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వవాత మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ విచారణకు హాజవుతున్నారు. 6 జనవరి 2025 న ఏసీబీ మొదటి సారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
ఫార్ములా-ఈ దోషి ఎవరు ❓
— YSR (@ysathishreddy) June 16, 2025
🚗 35Cr ఖర్చు చేసి
700Cr ఆదాయం సృష్టించి
🌍 ప్రపంచానికి హైదరాబాద్‌ను చూపించి
💰 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన
#KTR దోషా ❓
లేక
❌ ఉన్న అవకాశాన్ని వదులుకొని
❌ ఇచ్చిన 44Cr వదిలేసి
❌ ప్రపంచం ముందు హైదరాబాద్ పరువు
తీసిన… pic.twitter.com/HNrKXK8sY3





















