అన్వేషించండి

KTR SIT Questioning: "అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా తప్పు చేయలేదు, ఎవర్నీ వదిలి పెట్టను" ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ కామెంట్స్

KTR SIT Questioning: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై దుష్ప్రచారం చేశారని ఇప్పుడు విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

KTR SIT Questioning: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కాసేపట్లో విచారణకు హాజరుకానున్నారు. అంతకు ముందు ఆయన తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆయన విచారణకు వెళ్తున్న సందర్భంగా మహిళా నేతలంతా తిలకం దిద్ది పంపించారు. సీనియర్ నేతలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జరుగుతన్న విచారణ కేవలం టైంపాస్ కోసం చేస్తున్నారని ఆరోపించారు. 

Image

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి అనుక్షణం ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమించామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడు వేధింపులకు పాల్పడలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేన్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. వచ్చిన మొదటి రోజు నుంచి వివిధ కుంభకోణాలు అంటూ ప్రచారం చేశారని అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

"నా అంతరాత్మ సాక్షిగా నేను పుట్టిన నేల సాక్షిగా నేను తప్పు చేయలేదని ధైర్యంగా చెప్తున్నా... రెండేళ్లుగా నా మీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరికీ భయపడకుండా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న." అని అన్నారు.

Image

డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని కూడా దుష్ప్రచారం చేశారని కేటీఆర్ అన్నారు. వీటికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి ఫోన్‌లు ట్యాప్ కావడం లేదని ఎవరైనా అధికారుల చెప్పగలరా అని సవాల్ చేశారు. అసాంఘిక శక్తులను కట్టడి చేయడానికి కచ్చితంగా పోలీసులు ఫోన్లు ట్యాప్ చేస్తారని అన్నారు. గతంలో తమ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వానికి కూల్చేందుకు డబ్బులతో తిరిగిన వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్నారని అన్నారు. తన లాగే అందరూ ఉంటారనే ఇలా బురద జల్లుతున్నారని అన్నారు. 

Image

రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కోల్ టెండర్లు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేశారని దాన్ని బయటపెట్టినందుకే ముందుగా హరీష్‌రావుపై కక్ష కట్టారని కేటీఆర్ అన్నారు. అందుకే మొదట ఆయనకు  నోటీసులు ఇచ్చి పిలిచారని ఇప్పుడు తన వంతు వచ్చిందని చెప్పుకొచ్చారు. అక్రమ, అనైతిక పనులు ఎప్పుడూ చేయలేదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా డైవర్షన్ కోసమే జరుగుతుందని అన్నారు. మొత్తం కేబినెట్‌ దండుపాళ్యం మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. 

 

ఈ కేసును ఎవరు వదిలి పెట్టినా తాను మాత్రం విడిచిపెట్టబోనని కేటీఆర్ స్పష్టం చేశారు. తన క్యారెక్టర్‌ను దెబ్బ తీసేలా చేసిన రేవంత్ రెడ్డిని, కొందరు పోలీసు అధికారులను దోషులుగా నిలబెడతానని అన్నారు. ఎవరు ఎన్ని కక్ష సాధింపులకు దిగినా తమ పోరాటం ఆగబోదని చెప్పారు. కచ్చితంగా కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే వరకు విశ్రమించబోమని తేల్చి చెప్పారు. 

సిట్ కార్యాలయంలో పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థి విభాగం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బిఆర్ ఎస్ వి నేతలను అర్ధరాత్రి నుంచే అరెస్టు చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ నేతలను ఇంటి నుంచి రాకుండా కట్టడి చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget