అన్వేషించండి

KTR News: రేవంత్ రెడ్డి బినామీ బాగోతం బయటపడిందనే బీఆర్ఎస్ నేతలకు వరుస నోటీసులు: కేటీఆర్

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఇచ్చిన అన్ని ప్రాజెక్టులను తక్షణం నిలిపివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీ బాగోతం, ఆయన చేసిన ఫ్రాడ్ ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడానికి బీఆర్ఎస్ నేతలకు వరుస నోటీసులు ఇచ్చారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీబీఐ దర్యాప్తునకు ఎన్సీఎల్టీ ఆదేశించిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు ఎందుకు ఇచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్రమ సంపాదన కోసమా, లేక బినామీ కంపెనీకి ప్రాజెక్టుల కోసమా, కమీషన్ల కోసమా అని కేటీఆర్ నిలదీశారు. దీనిమీద సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. న్యాయమూర్తిని సైతం ప్రలోభపెట్టాలని చూశారని పేర్కొన్నారు. బినామీ కంపెనీ కాకపోతే నిషేధం ఉన్న కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు ఎలా కట్టబెట్టారని, ఆయన పాత్ర ఏంటో తేలాలన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాంలను అడ్డుకున్నది బీఆర్ఎస్..

తెలంగాణ భవన్‌లో బుధవారం నాడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ‘మూసీ అభివద్ధి పేరుతో 1.5 లక్షల కోట్ల దోపిడీని అడ్డుకున్నది బీఆర్ఎస్, లగచర్లలో తన సొంత అల్లుడి కంపెనీ కోసం ఫార్మా సిటీ పేరుతో గిరిజనుల మీద దాడి చేస్తే స్కాంను బయటపెట్టింది తామేనన్నారు. హెచ్ఐఎల్‌టీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భూ భాగోతాన్ని బయటపెట్టాం, సీఎం రేవంత్ రెడ్డి బావమరిది అమృత్ లో చేసిన స్కాంను బయటపెట్టాం. ఇటీవల సింగరేణి బొగ్గుగణుల్లో కాంగ్రెస్ మోసాలను బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అన్నారు. ఇలాంటి స్కాంలు, కుంభకోణాలు బయటపెడుతున్నందున జనవరి 22, 23 తరువాత మొదట హరీష్ రావు, తరువాత నాకు, సంతోష్ కుమార్, పార్టీ అధినేత కేసీఆర్ కు వరుస నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడంతో మాకు అనుమానం వచ్చింది. అన్ని విషయాలు గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి బినామా బాగోతం బయటపడింది. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో విషయం బయటకు..

జనవరి 23న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. KLSR ఇన్‌ఫ్రా అనేది రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ. మాతో ఆధారాలున్నాయి. దివాళా తీసిన కంపెనీ ఐపీ ప్రొఫెషనల్స్ లేకుండా రూ.6 వేల కోట్ల పనులకు కాంట్రాక్టులు ఎలా వచ్చాయని చూస్తే తెలంగాణలో వచ్చాయి. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఈరోజు ఆయన బినామీ మాస్టర్ అని తేలిపోయింది. బ్లాక్ మెయిల్ చేసి గతంలో సంపాదించిన డబ్బును ఆయన బినామీ కంపెనీలకు తరలిస్తున్నాడు. వేల కోట్ల ప్రాజెక్టులను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సహా పలు ప్రాజెక్టులు కట్టబెట్టారు. 

2018 సెప్టెంబర్ 27న రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల మీద ఐటీ రైడ్స్ జరిగాయి. ఆయన బావమరిది కంపెనీ సాయి మౌర్య ఎస్టేట్స్ వాళ్లు ట్యాక్స్ సరిగ్గా కట్టలేదని ఐటీ తెలిపింది. కేఎల్‌ఎస్ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ రేవంత్ దని ఇది ఒక ప్రూఫ్. రేవంత్ రెడ్డి తిరుగుతున్న ల్యాండ్ క్రూజర్ కార్ నెంబర్ టీఎస్ o7 ఎఫ్ఎఫ్ 0009 ఇది కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ పేరిట రిజిస్టర్ అయింది. రేవంత్ కు కారు ఎందుకు కొనిచ్చారంటే వాళ్లు రియల్ ఎస్టేట్, ఇతర లావాదేవీలు చేస్తున్నారు. 

జడ్జిని ప్రలోభపెట్టాలని చూసిన కంపెనీ..

2023 జులైలో కేఎల్ఎస్ఆర్, మరో కంపెని (ఏఎస్ ఎన్విటి)కి గొడవ జరగడంతో ఎన్‌సీఏటీని ఆశ్రయించారు. రేవంత్ రెడ్డికి ఉన్న బుద్ధులే ఈ కంపెనీకి ఉన్నాయి. NCLAT జడ్జి శరత్ కుమార్ తనకు ఫోన్లో మెస్సేజ్ వచ్చిందని, కేఎల్ఎస్ఆర్ కంపెనీకి మద్దతుగా తీర్పు ఇవ్వాలని మెస్సేజ్ రావడంతో ఒత్తిడి తట్టుకోలేక తప్పుకున్నారు. ఆ బినామీ కంపెనీకి రేవంత్ రెడ్డి అండ ఉంది. బనామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ కంపెనీ నుంచి సాయి మౌర్య డెవలపర్స్ లోకి డబ్బులు పెట్టి, భూములు కొని లాభాలు తెచ్చే పనిని భూపాల్ ఇన్ ఫ్రా చూసుకుంటుంది. 2018లోనే రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీఅని ఐటీ కంపెనీ రైడ్స్ ద్వారా బయటకొచ్చింది. రేవంత్ సీఎం కాగానే కేఎల్‌ఎస్ఆర్ కంపెనీకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, జల్ జీవన్ అమృత్ స్కీం కింద 6 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు వచ్చాయి.

దివాళా కంపెనీకి ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు..

మెదక్ లో ఆర్ అండ్ బీకి 111 కోట్లు, షాద్ నగర్, పరిగి రోడ్డు 135 కోట్లు, సూర్యపేట మోతే లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.1910 కోట్లు, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కోదాడకు 300 కోట్లు, కొడంగల్ లో వెటర్నరీ కాలేజీకి రూ.145 కోట్లు, మిషన్ భగీరథలో 160 కోట్లు ఇలా దాదాపు 6 వేల కోట్లు కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ప్రాజెక్టులు వచ్చాయి. అయితే 2023లో కంపెనీ దివాళా తీసింది. దానిపై పిటిషన్ సైతం ఎన్సీఎల్టీలో నడుస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక అప్పులు తీసుకున్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రూ.6వేల కోట్లు వచ్చాయంటే ఏ విధంగా నిధులు వచ్చాయో తెలుస్తుంది. ఆర్థిక లావాదేవిలు ఆపివేయాలని జనవరి 23న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీకి ఎందుకు ప్రాజెక్టులు ఇచ్చారని కోర్టు ప్రశ్నించినా కార్యకలాపాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి విచారణ జరపడం వెనుక రేవంత్ రెడ్డి బినామా బాగోతం సుప్రీంకోర్టులో బయటపడటమే కారణమని’ కేటీఆర్ అన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget