అన్వేషించండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు- ప్రణీత్ రావుపై చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ

Praneeth Rao Demoted to CI | ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు ప్రణీత్ రావును డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేసింది.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దుగ్యాల ప్రణీత్ రావు హోదాను తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీఎస్పీ (DSP) స్థాయి నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) స్థాయికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక పోలీసు అధికారిని డీఎస్పీ హోదా నుంచి సీఐగా డిమోట్ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB)లో పనిచేసిన ప్రణీత్ రావు, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రణీత్ రావుకు గత కేసీఆర్ ప్రభుత్వం యాక్సిలరేటెడ్ పదోన్నతి కింద డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చింది. అయితే, ప్రొబేషన్ కాలంలోనే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసినట్లు సిట్ (SIT) విచారణలో తేలింది. దీంతో ఆయనకు గతంలో ఇచ్చిన ఆ పదోన్నతిని రద్దు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

సిట్ నివేదిక ప్రాథమిక సమాచారం ప్రకారం, 2023 నవంబర్ 15న ఒక్కరోజే దాదాపు 650 ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలోని డేటాను, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తోంది. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. తాజా డిమోషన్ ఉత్తర్వులతో ప్రణీత్ రావు ఇకపై ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు.

కీలక దశకు చేరుకున్న ట్యాపింగ్ కేసు విచారణ..

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, మరియు హరీష్ రావులకు సిట్ (SIT) అధికారులు నోటీసులు జారీ చేసి ఇటీవల వేరు వేరు రోజుల్లో వారిని విచారించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, పార్టీకి చెందిన కొందరు నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే అభియోగాలపై ఈ విచారణ సాగింది. నిబంధనలకు విరుద్ధంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) అధికారులకు ఆదేశాలు జారీ చేయడంలో వీరి పాత్ర ఏమిటనే కోణంలో అధికారులు ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇటీవల అరెస్ట్ చేసిన ఎస్ఐబీ పోలీసు అధికారుల వాంగ్మూలాలను వీరి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎన్నికల సమయంలో నిధుల తరలింపును పర్యవేక్షించడానికి, ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలపై క్లారిటీ కోరారు. అయితే, నోటీసులు అందుకున్న నేతలు ఈ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపుగా కొట్టిపారేస్తూ, చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. ఈ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా మరికొంత మంది కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
KTR Fires On Revanth Reddy:
"యువకులు ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్‌క్యాలెండర్‌ ఏమైంది?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget