అన్వేషించండి

Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ

Telangana Municipal Polls | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు కీలక ప్రకట చేశారు.

Telangana Municipal Elections 2026 | హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏలో తమ మిత్రపక్షమైన బీజేపీ (BJP) అభ్యర్థుల గెలుపు కోసం ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

పవన్ కళ్యాణ్‌తో బీజేపీ కీలక నేతలు భేటీ

తెలంగాణ బిజెపి ముఖ్య నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఇరుపార్టీల రాజకీయ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అభివృద్ధి అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీ చర్చించారు. జనసేనాని తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను కోరారు. జనేసేన, బీజేపీ నేతల మధ్య సమన్వయం ద్వారా ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు.

అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో బిజెపికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని తెలిపారు. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటించారు. ఈ పొత్తు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారని, ఎన్నికల ప్రచారానికి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి ప్రచారం తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget