అన్వేషించండి

KTR News: కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు, వెంటనే ఎస్పీకి ఫోన్ కొట్టిన బీఆర్ఎస్ నేత

Industrial corridor notification in Vikarabad District | వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా భూ బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని, న్యాయ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ని తెలంగాణ భవన్లో కలిసి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తనను కలిసిన ఫార్మా సిటీ భూ సేకరణ బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 

లగచర్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ వారికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన భూసేకరణ బాధితులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసుల ద్వారా బాధిత కుటుంబాలను వేధించడం మానుకోవాలన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం తగదన్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన మాట్లాడిన కేటీఆర్, బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసు వేధింపులను నిలిపివేయాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల అంశం లేవనెత్తనున్న బీఆర్ఎస్

అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల భూ సేకరణ బాధితుల డిమాండ్లను లేవనెత్తుతామని కేటీఆర్ తెలిపారు. భూముల కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న బాధితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. గిరిజనులు, పేద రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ బాధితుల తరఫున నిలబడుతుందని స్పష్టం చేశారు. లగచర్ల బాధితులు చేసిన పోరాటంకు తలవంచి ప్రభుత్వం దిగి వచ్చిందని, నోటిఫికేషన్ రద్దు చేసుకుందన్నారు. కానీ మరోసారి అవే భూములను పారిశ్రామిక కారిడార్ (Industrial Corridor) పేరుతో సేకరించడం మానుకోవాలని, నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఇకనైనా నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన భూములను వదిలి, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరించి ఫార్మా పరిశ్రమల కోసం ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గానికి నిదర్శనమని మండిపడ్డారు. జైల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వంటి వారి తరపున, అక్రమంగా కేసులతో జైల్లో ఉన్న బాధితుల తరఫున, న్యాయపోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.

Also Read: Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్ 

తెలంగాణ ప్రభుత్వం లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూముల సేకరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో లగచర్లకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై ప్లాన్ ప్రకారం దాడి జరిగింది. వారి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని, మరికొందర్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. రైతులు ధర్నాలు, ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఫార్మా సిటీ నోటిఫికేషన్ రద్దు చేసింది. అక్కడ ఇండస్ట్రీయల్ కారిడార్ వస్తుందని, ఫార్మా సిటీ కాదని మరో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget