అన్వేషించండి

MLC Kavitha Sensational Comments: అది భూ భారతి కాదు భూ హారతి, అది తిరోగమన చర్య - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Bhu Bharati Bill | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణిలో లోపాలు లేకున్నా ఆరోపణలు చేశారని, కేసీఆర్ భూ సమస్యలు తొలగించారని అన్నారు.

BRS MLC Kavitha About Bhu Bharati Bill | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కోసం తీసుకొచ్చిన భూభారతి చట్టం, భూ హారతి అవుతుందని భూభారతి బిల్లుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూమోసాలు పోయాయి. తెలంగాణ రైతుకు రక్షణ కవచం ధరణి. అలాంటి ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదు. రాష్ట్ర ప్రజలు, రైతులు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారని నమ్మకం ఉంది. 


భూభారతి ఒక తిరోగమన చర్య
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఒక తిరోగమన చర్య. ఆ చట్టం కచ్చితంగా భూహారతి  అయ్యేటట్లు కనిపిస్తుంది. ఆ భూ మాత పోర్టల్ భవిష్యత్తులో భూమేతకే దారి తీస్తుంది. బీఆర్ఎస్ (BRS) అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు భావిస్తున్నారు. భూమి కోసం ప్రాణమిచ్చేది ఒకరు సైనికుడు అయితే, మరొకరు రైతు. ధరణిలో ఏమైనా సమస్యలు కనిపిస్తే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలి. కానీ ఆ వ్యవస్థనే రద్దు చేయడం సరికాదు. ధరణిలో కుట్ర జరిగిందని ప్రభుత్వం చెప్పడం దారుణం. 

తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నారు. మరో 17.8 లక్షల ఎకరాల భూమి వివాదాల్లో ఉంది. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20 నుంచి 25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరగాల్సి వచ్చేది. కేసీఆర్ రైతుకు మాత్రమే భూమి యాజమాన్య హక్కు ఉండేలా చేశారు. రైతుల భూమికి భద్రత కల్పించింది కేసీఆర్. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. 100 రోజుల్లో దాదాపు 35749 ఉద్యోగులు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళణ చేశారు. అనంతరం భూమి వివరాలను ధరణిలో ఎక్కించారు. ధరణి కన్నా ముందు చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేది.

Also Read: Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన

బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో ప్రభుత్వ భూములను కాపాడింది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు. భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు చేరువ చేసింది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి చేయడం వల్ల పని 42 నిమిషాల్లో పూర్తయ్యేది. భూ రికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగి, రాష్ట్ర సంపద పెరిగింది. మ్యాన్యువల్ పహాణీల వల్ల పలు వివాదాలు ఏర్పడేవి. ధరణి పోర్టల్ ఆ సమస్యను తీర్చింది.
భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతు బంధు అందింది. దాదాపు 66 లక్షల మందికి రైతులకు రైతు బంధు అందించాం.

గతంలో పంట రుణాలు వచ్చేవి కావు. ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంటలకు లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి కల్పించాం. ధరణి పోర్టల్ ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారు. భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్ బీ లో చేర్చాం. ఎంజాయ్ మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతుంది. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే ఎంజాయ్ మెంట్ సర్వే తేనెతుట్టెను కదిలించొద్దు. 

మళ్లీ 32 కాలమ్ లతో పహాణీలను రాయడం మొదలుపెడితే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది. రైతుల మధ్య వివాదాలు తలెత్తి కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది. ఒకే సారి కాకుండా... దశల వారీగా రీసర్వే  చేయాలి. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్ బుక్ లు ఉన్నాకా... భూధార్ కార్డు అవసర ఏంటి ?
ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వ
హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారంలో ఉంది. భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు. భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనపై వెనక్కి తగ్గాలి. కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Also Read: Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget