అన్వేషించండి

Kavitha News: ఆడబిడ్డలను అవమానించడానికి కాంగ్రెస్ నేతల్ని ఆంబోతుల్లా వదిలారు: కవిత సంచలన వ్యాఖ్యలు

Telangana News | కాంగ్రెస్ నేతలకు ఎన్నికల సమయంలో మాత్రమే బతుకమ్మ గుర్తుకొస్తుందని, ఎన్నికల తరువాత ఆడబిడ్డల్ని దారుణంగా అవమానించేలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Telangana Talli Statue | హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను కించపరుచుతూ మాట్లాడిన రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్రను కోరుకున్న కాంగ్రెస్ నేతల వాదనలను ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారని కవిత విమర్శించారు. ‘వాళ్లు ఎప్పటికీ కాంగ్రెస్ వాదులే కానీ, తెలంగాణవాదులు కాదు. వాళ్లకు కేవలం కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలు కాని’ కవిత స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నాడు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఇందిరా గాంధీ, సోనియా గాంధీ బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బతుకమ్మ ఎత్తుకొని శుభాకాంక్షలు చెప్పారు. 1978లో ఇందిరా గాంధీ వరంగల్ మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్రతో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ (Rahul Gandhi)... రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులతో కలిసి బతుకమ్మ ఆడారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రం కాంగ్రెస్ నాయకులకు బతుకమ్మ గుర్తుకొస్తుంది. అంటే ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు ఎన్ని ఆటలైనా ఆడుతారు. ఎన్నికల తరువాత బతుకమ్మ ఎవరిదని, తెలంగాణ తల్లి (Telangana Talli) చేతిలో బతుకమ్మ ఎందుకు ఉండాలని కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని’ కవిత సూచించారు.


కేసీఆర్ సీఎంగా ఉన్నప్పడు బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే రాష్ట్ర పండుగను అవమానించేలా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రుల, కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారో, ఏం శిక్ష వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రులను, కాంగ్రెస్ నాయకులను ఆంబోతులను వదిలిట్లు తెలంగాణ ఆడబిడ్డలపై మాట్లాడడానికి  వదిలిపెట్టారా అన్నది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బతుకమ్మను తాము విశ్వవ్యాప్తం చేయడానికి చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 

తెలంగాణ రూపాన్ని మార్చడం ఏంటి?
తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దేశంలో భరతమాత, మహాత్మా గాంధీ, అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్, పూలే, శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిని పెట్టాలని ఎవరో జీవో ఇచ్చారని కాదు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్టిన భరతమాత విగ్రహాలకు కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా ? కానీ తెలంగాణలో మాత్రం ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి, లేకపోతే పెడితే కేసులు పెడుతామని ప్రభుత్వం గెజిట్ చేసింది. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెజిట్ ఇవ్వడం చాలా దారుణం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, BRS ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకుంటాం అన్నారు. 

Also Read: Allu Arjun Bail: అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ - హైకోర్టులో ఊరట - చంచల్ గూడ జైలు తప్పినట్లే !

రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ ను, కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి  చేశారు. కానీ ఎవరు బుద్ది చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కనిపిస్తున్నారు.  అబద్దాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ను మించిపోయారు. ఏపీకి అక్రమంగా నీళ్లు మళ్లించడానికి జీవోలు జారీ చేసిన ఆదిత్యానాథ్ దాస్ ను  తెలంగాణ సాగునీటిపారుదల శాఖ నియమించడం ఏంటని ప్రశ్నించారు.

14న రౌండ్ టేబుల్ సమావేశం
కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న సాంస్కృతిక విధ్వంసం, తెలంగాణ తల్లి (Telangana Talli Statue) రూపం మార్చడంతో పాటు అధికారిక వేడుకల్లో తెలంగాణ పాటలు కాకుండా వేరే పాటలు పాడించడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో డిసెంబర్ 14న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సమావేశంలో కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు, ఆయా రంగాల ప్రముఖులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Vivo X200 Pro: దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Embed widget