అన్వేషించండి

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్

రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. చైర్మన్ పోడియం చుట్టుముట్టు పేపర్లు చింపివేసి నిరసన తెలిపారు.

శాసనసభ నుంచి 24 మంది భారాస ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో 24 మంది BRS ఎమ్మెల్యేలపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్‌పై చర్చను అడ్డుకుంటున్నారని భావిస్తూ, సోమవారం సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. అంతకుముందు ఆదివారం సభ ప్రారంభమైన వెంటనే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ పోడియం వద్ద బైఠాయించారు.

సభలో బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలోనూ సభ్యులు బల్లలు చరుస్తూ, నినాదాలు చేస్తూ నిరసనను కొనసాగించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సభాపతి అనుమతితో ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. నిరసన విరమిస్తే చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని స్పీకర్ చెప్పారు. అయితే, సభాసంఘం ఏర్పాటుతో పాటు సీఎం రేవంత్ చేసిన ఆరోపణలపై మాట్లాడే అవకాశం ఇస్తేనే తాము తమ స్థానాల్లోకి వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

నిరసనలు తగ్గకపోవడంతో, ప్రభుత్వ పక్షం తరఫున మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి స్పీకర్ ఆమోదం తెలుపుతూ హరీశ్‌రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా మొత్తం 24 మంది సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి ఆ రోజు సభకు హాజరుకాకపోవడంతో వారిపై ఈ చర్యలు ఉండవు. సస్పెన్షన్ అనంతరం స్పీకర్ శాసనసభను సోమవారానికి వాయిదా వేయగా, బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Advertisement

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Embed widget