అన్వేషించండి

KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?

KCR : కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం వల్ల ఆయనపై అనర్హతా వేటు వేసే అవకాశంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ అంత రిస్క్ తీసుకోరని అంటున్నారు.

Will KCR be disqualified for not attending the assembly: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఏపీలో జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీతో దీన్ని పోలుస్తూ అనర్హతా వేటు వేయవచ్చన్న  చర్చ జరుగతోంది.  బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకాకపోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గత రెండేళ్లుగా కేసీఆర్ సభకు రావడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఆయన గౌరవించడం లేదని రేవంత్ విమర్శించారు. సభకు రాకుండానే కోట్ల రూపాయల జీతభత్యాలు తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాకను తాము కోరుకుంటున్నామని చెబుతూనే, ఆయన వైఖరిని అహంకారం గా రేవంత్ అభివర్ణించారు.

 రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి? 

భారత రాజ్యాంగంలోని  ఆర్టికల్ 191,  101  ప్రకారం, ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ సభకు ముందస్తు అనుమతి లేకుండా వరుసగా  60  సభ జరిగిన రోజులు గైర్హాజరైతే, సదరు సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.  అయితే, ఈ 60 రోజులను లెక్కించేటప్పుడు సభ వాయిదా పడిన లేదా ప్రోరోగ్ అయిన కాలాన్ని మినహాయిస్తారు.  సభకు రానంత మాత్రాన అనర్హత  వేటు పడదు, కానీ స్పీకర్ ఆ స్థానాన్ని  ఖాళీ గా ప్రకటిస్తే ఉప ఎన్నికకు దారితీసే అవకాశం ఉంటుంది.

 ఏపీలో పరిస్థితి -  జగన్ వర్సెస్ స్పీకర్ 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , ఇతర 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. తనకు ప్రతిపక్ష నేత  హోదా ఇవ్వడం లేదన్న నిరసనతో వారు సభను బహిష్కరిస్తున్నారు. దీనిపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు.  పని చేయని వారికి జీతం లేదు అనే విధానాన్ని తేవాలని, అవసరమైతే  రైట్ టు రీకాల్ కోసం పార్లమెంటుకు సిఫార్సు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. 65 రోజుల గైర్హాజరీపై నోటీసులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

 తెలంగాణలో అనర్హత వేటు సాధ్యమేనా? 

కేసీఆర్ లాంటి కీలక నేతపై అనర్హత వేటు వేయడం అంత సులభమైన విషయం కాదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కే అది రాజకీయంగా  సానుభూతి కోసం వాడుకోవడానికి ఆయనకు అవకాశం ఇస్తుంది. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో సానుభూతి పెంచవచ్చు. కేసీఆర్ తన గైర్హాజరీకి సంబంధించి ఆరోగ్య కారణాలనో లేదా ఇతర కారణాలనో చూపుతూ స్పీకర్‌కు లేఖ రాస్తే, ఈ 60 రోజుల నిబంధన వర్తించదు. సాధారణంగా స్పీకర్లు ఇటువంటి సందర్భాల్లో నోటీసులు జారీ చేసి వివరణ కోరుతారు తప్ప, నేరుగా అనర్హత వేటు వేయడం చాలా అరుదు.

 వ్యూహాత్మక మౌనం  

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి కేసీఆర్‌ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తోంది. సభకు రాకుండా జీతం తీసుకుంటున్నారు  అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీయవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపీలో లాగే ఇక్కడ కూడా స్పీకర్ ద్వారా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది కానీ, తక్షణమే అనర్హత వేటు వేసేంత సాహసం చేసే అవకాశం తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ సభకు రాకపోవడం వల్ల నష్టపోయేది ఆయనేనని, ప్రభుత్వం వైపు నుంచి ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే విమర్శ రాకుండా చూసుకోవడమే రేవంత్ వ్యూహమని చెబుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget