అన్వేషించండి

Harish Rao: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్న మాజీ మంత్రి

Telangana News | కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నాణ్యతా లోపం ఆరోపణలతో ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు.

kaleshwaram commission | హైదరాబాద్: తనకు చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు. 

న్యాయవ్యవస్థ, చట్టాల మీద గౌరవం ఉంది

అంతకుముందు సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అయిన తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నేటి ఉదయం కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేదు. మా పాలనలో ఉన్నంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం. బీఆర్ఎస్ పార్టీకి న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉంది. అందుకే నోటీసులు రాగానే కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతున్నాం. 

రైతుల కోసం కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం..

కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరించకూడదు. రాష్ట్ర రైతుల కోసం కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా వేలాది ఎకరాలను సాగునీరు అందించాం. దాంతో వేలాది బంజరు భూములు, బీడు భూములను రైతులు సాగు చేసి పంటలు పండించారు. ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి, దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాం’ అన్నారు హరీష్ రావు.

తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు కాళేశ్వరం కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. వీరు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులలో వారికి కమిషన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో జూన్ 5న అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తనకు తెలిసిన విషయాలను కమిషన్ కు వెల్లడించానన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని చెప్పిన ఈటల.. కాళేశ్వరం ప్రాజెక్టులో తన పాత్ర పరిమితమేనని చెప్పారు. 

ప్రాజెక్టు, సాగునీటిపారుదల శాఖకు సంబంధించిన విషయం కాగా.. అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే ఆర్థిక శాఖపై ఉంటుందన్నారు. అధికారులు, ఇంజినీర్లు, నిపుణుల రిపోర్ట్ వచ్చాక మంత్రుల సబ్ కమిటీ దీనిపై చర్చించింది. తుది నివేదికను మంత్రివర్గం మొత్తం ఆమోదించిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసినట్లు ఈటల తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget