దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్‌ఎస్- రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంటర్
బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే కుట్ర చేస్తారా ? అంటూ రాహుల్‌పై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సే అంటూ శంపించారు.
బీఆర్‌ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అంటూ ఖమ్మంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై అధికార పార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వస్తోంది. రాహుల్ చేసిన విమర్శలపై ట్విటర్‌లో స్పందించిన మంత్రి కేటీఆర్ పెద్ద వ్యాసమే రాసుకొచ్చారు. తమకు బంధువులు పార్టీ కాదని, కాంగ్రెస‌్యే భారత రాబందలు పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..."మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. ఏఐసీసీ అంటేనే... అఖిల భారత కరప్షన్ కమిటీ. దేశంలో... అవినీతికి, అసమర్థతకు.. ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్. స్కాములే తాచుపాములై.. మీ యూపీఏను..దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదు. మా పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ... ఒంటిచేత్తో ఢీకొట్టే.. ఢీ టీమ్.. బీఆర్ఎస్.
బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా ? ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది.. కాంగ్రెస్సే. లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా ? అర్థంలేని ఆరోపణలు చేసి.. ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు. తెలంగాణ ప్రజలు కోరుతోంది.. నిర్మాణాత్మక ప్రతిపక్షం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. కర్ణాటకలో “అన్నభాగ్య” హామీని గంగలో కలిపి.. ఇక్కడ 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు ? ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు ?
మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..
— KTR (@KTRBRS) July 2, 2023
మీదే భారత రాబందుల పార్టీ
ఏఐసీసీ అంటేనే...
అఖిల భారత కరప్షన్ కమిటీ
All India Corruption Committee
దేశంలో...
అవినీతికి, అసమర్థతకు..
ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్
స్కాములే తాచుపాములై..
మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను
దిగమింగిన…
కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదు.. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదు - సమర్థత అంతకన్నా కాదు. సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..??కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోండి.. 4.6 లక్షల ఎకరాలు పంచి అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు. జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసిఆర్.. మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు మా పాలనలో మన్యానికి మంచిరోజులు.
తెలంగాణలో... నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ మాది... బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన.. ఎప్పుడూ నిలబడే పార్టీ... మీది. కారు స్టీరింగ్ కేసిఆర్ గారి చేతిలో పదిలం కానీ కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పింది. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్.. ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్. మా తొమ్మిదేళ్ల పాలన.. వెలుగుల ప్రస్థానం గత కాంగ్రెస్ పదేళ్ల పాలన.. చీకటి అధ్యాయం.
కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలం.. ఇది..చైతన్యానికి ప్రతీకైన.. తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజం.. బీఆర్ఎస్ విస్తరిస్తే అంత వణుకెందుకు ? జాతీయ రాజకీయాలు.. మీ జాగీరా.. ??వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం.. బీఆర్ఎస్." అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్.