News
News
వీడియోలు ఆటలు
X

అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఓ రేంజిలో! సభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా విగ్రహావిష్కరణ

అనంతరం నిర్వహించే సభ ఏర్పాట్లపై సీఎం దిశానిర్దేశం

FOLLOW US: 
Share:

హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మహాఘనంగా ఆవిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నతస్థాయిలో చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టిన రోజు(జయంతి) సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం, అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రసమయి బాలకిషన్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి, కలకాలం నిలిచే విధంగా సాంకేతికంగా, తయారీపరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడాని కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకున్నదని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పలు దేశాలు ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి, పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం, అత్యంత సంతృప్తిని కలిగించిందని సీఎం కేసీఆర్ అన్నారు.

 సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు :

 • ఏప్రిల్ 14 న జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా,కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలి.
 • ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపిస్తూ భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన పుష్పాంజలి ఘటించాలి.
 • గులాబీలు, తెల్లచామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి.
 • 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి అతి పెద్ద క్రేన్ ను ఉపయోగించాలి.
 • ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలి.
 • సచివాలయ సిబ్బంది అధికారులతో పాటు అన్ని శాఖల హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు (రాజ్యసభ లోక్ సభ) , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు హాజరుకావాలి.
 • ప్రతి నియోజకవర్గం నుంచి 300మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.
 • ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలి.
 • హైదరాబాద్ చేరుకునేలోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభకు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లను చూసుకోవాలి. సభానంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా రాత్రి భోజనం ఏర్పాట్లు చూసుకోవాలి.
 • ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర వాటర్ ప్యాకెట్లు అందుబాటులో వుంచాలి.
 • పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వున్నందున, విగ్రహ చుట్టు పక్కల ప్రాంతాన్ని మొత్తం వినియోగించుకోవాలి. ప్రజలకు ఎండవేడి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేయాలి.
 • ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ బాధ్యతను హైదరాబాద్ సీపీ తీసుకోవాలి. అందుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలి.
 • సభరోజు సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇతర మార్గాలను పోలీస్ యంత్రాంగం చూడాలి.
 • సంబంధించిన ఏర్పాట్లలో హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డిజిపి అంజన్ కుమార్, సీపీ సీవి ఆనంద్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శులు అధికారులు బాధ్యత వహించాలి.
 • ఈ సందర్భంగా ఘనమైన రీతిలో ఆటపాటలతో సంబరాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఇందుకు గిడ్డంగుల శాఖ చైర్మన్, గాయకుడు సాయిచంద్‌తో కలిసి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కార్యక్రమాలను రూపొందించాలి.
 • అంబేద్కర్‌కు సంబంధించిన పాటలను మాత్రమే పాడుతూ, ఆ మహనీయునికి తెలంగాణ సాంస్కృతిక నీరాజనం అర్పించాలి. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ తదితర ముందస్తు సన్నద్దత బాధ్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకోవాలి.
 • అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అధికారిక కార్యక్రమం. కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలి.
 • విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేద్కర్ మాత్రమే ఒకేఒక ముఖ్య అతిథిగా పిలవాలని నిర్ణయం
 • అంబేద్కర్ మహాశయుని ఔన్నత్యాన్ని చాటే విధంగా దేశవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలి.
 • ఇందుకు సంబంధించి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు విగ్రహావిష్కరణ, సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
 • ఈ సందర్భంగా సభికులకు అనువుగా LED స్క్రీన్లను ఏర్పాటు చేయాలి.
 • సభికుల కోసం 40వేల కుర్చీలను ఏర్పాటు చేయాలి.
 • ఎంపికే చేయబడిన ఆహ్వానితులు సంబంధిత మేధావులు తదితర ప్రముఖుల కోసం పాస్ లు రూపొందించి జారీ చేయాలి.
 • అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలి.
 • ఏప్రిల్ 14 మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమౌతుంది. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగం వుంటుంది. తర్వాత ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. తదుపరి ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఉంటుంది. సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ధన్యవాద ప్రసంగంతో సభ ముగుస్తుంది.

Published at : 04 Apr 2023 10:15 PM (IST) Tags: Hyderabad ambedkar Ambedkar Statue CM KCR Tankbund

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు