K Laxman On KCR: కేసీఆర్ సవాల్‌కి బీజేపీ సై! దమ్ముంటే చేసిచూపాలని ఎంపీ లక్ష్మణ్ ఛాలెంజ్
MP Lakshman: కేసీఆర్ సవాలు చేసినట్లుగా అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రతిసవాలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వత శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాటలాడా. కేసీఆర్ సవాలు చేసినట్లుగా అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రతిసవాలు చేశారు. అందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణకు పట్టిన పీడను ఎప్పుడు వదిలించుకోవాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొడదామని ప్రజలు ఎదురుచుస్తున్నారని అన్నారు.
Taken oath as Member of Parliament - Rajya Sabha today.
— Dr K Laxman (@drlaxmanbjp) July 8, 2022
I thank Hon'ble PM Shri @narendramodi Ji, @BJP4India Nat'l President Shri @JPNadda Ji, Home Minister Shri @amitshah Ji, UP CM Shri @myogiadityanath Ji & @BJP4India Org Sec Shri @blsanthosh Ji for giving me this opportunity. pic.twitter.com/XbxBsdXi8Y
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనా తెలంగాణ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి పట్ల రాజ్యసభ సభ వేదికగా తాను పోరాడతానని చెప్పారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు పూర్తి అయిన 10 రోజులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రమత్తు నుంచి మేల్కొన్నారని, ప్రధానమంత్రిపై విమర్శలు చేయడంతో పాటు, తనపైన కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడమే అని అన్నారు.
80 వేలకు పైగా పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ ఓ రాజకీయ అజ్ఞానిగా మారారని విమర్శించారు. తెలంగాణ బిడ్డను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిన అగ్రనేత నరేంద్ర మోదీని చూసి ఓర్వలేక అహంకార పూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు.