అన్వేషించండి

Balakrishna Comments on Yoga: యోగా మన సంస్కృతికి దక్కిన గౌరవం, యోగా సాధనపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

Balakrishna Comments on Yoga: ప్రపంచమంతా యోగాను అంగీకరించడం మన సంస్కృతికి దక్కిన గౌరవమని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. యోగాను నియమం తప్పకుండా అభ్యాసం చేయాలని సూచించారు.

International Yoga Day 2022: యోగాభ్యాసం మనిషి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. యోగాను నియమం తప్పకుండా అభ్యాసం చేయాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచమంతా యోగాను అంగీకరించడం మన సంస్కృతికి దక్కిన గౌరవం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఘనంగా నిర్వహించాయి. 

రుషులు, యోగా గురువుల గొప్పతనం అదీ.. 
అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ 8 వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 15 దేశాలతో మొదలై ప్రస్తుతం 175 దేశాలకు యోగా దినోత్సవం నేడు విస్తరించిందనన్నారు. మన రుషులు, యోగా గురువుల గొప్ప తనాన్ని ప్రపంచమంతా అంగీకరించి గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు.  ఓంకారంతో ప్రారంభించబడే ఈ యోగా సాధన... షడ్ చక్రాల దర్శన భాగ్యం కలిగిస్తుందని, పూర్వకాలంలో మన రుషులు ఎంతో సాధన చేసి అందించిన ఈ ప్రక్రియను అందరూ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.  యోగా ద్వారా ఒక లక్ష్యంపై మనస్సు ఏకాగ్రతతో సాధించడం వీలవుతుందనన్నారు.

యోగా అంటే ఏమిటి ?
యోగం అంటే మనను మనం గెలుచుకోవడం అని అర్థం అన్నారు.  పతంజలి మహర్షి చెప్పినట్లు చంచలమైన మనస్సును గట్టి పరచుకొని చిత్త ప్రవుత్తులను వశం చేసుకొని విజయపధాన సాగించానికి వీలవుతుందని చెప్పారు.  మన గురువులు వ్యక్తి మనస్థత్వాన్ని బట్టి పలు రకాల యోగాను నిర్థేశించారని, తద్వారా మనిషిలో నిక్షిప్తమైన శక్తిని వెలికితీయడమే యోగాభ్యాస లక్ష్యమని తెలుసుకోవాలని సూచించారు. అంతే గాకుండా యోగాభ్యాసంతో అంతఃకరణ శుద్ది జరిగి, శరీర రుగ్మతలను నివారించుకోవచ్చని అంటూ యోగాను నిరంతరం అభ్యాసం చేసి దాని మంచి ఫలాలను అందుకోవాలని సూచించారు. యోగాను ఆచరించాలని తండ్రి ఎన్టీఆర్ సైతం చెప్పేవారని, ఆయన ఆచరించి చూపించారని ఈ సందర్భంగా బాలయ్య గుర్తుచేసుకున్నారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క ప్రత్యామ్నాయ వైద్య విధాన విభాగం యాడ్ లైఫ్ వారి ఆధ్వర్యంలో 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా యాడ్ లైఫ్ యోగా విభాగాచార్యులు ఉదయ కుమార్ ప్రత్యేకమైన యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ప్రసంగించారు. ఓంకార స్వరం పలకడంతో ప్రారంభించిన ఈ యోగా కార్యక్రమంలో యాడ్ లైఫ్‌నకు చెందిన యోగా గురువు ఉదయకుమార్ అందరితో పలు రకాల యోగాసనాలు అభ్యాసం చేయించారు.  అనంతరం జరిగిన కార్యక్రమంలో గురువుగా వ్యవహరించిన ఉదయకుమార్‌ను బాలకృష్ణ సత్కరించారు. 

Also Read: Yoga For Libido: లైంగిక సామర్థ్యాన్ని పెంచే యోగా భంగిమలు, ఈ ఆసనాలతో శృంగారంలో తిరుగే ఉండదట!

Also Read: International Yoga Day 2022: 17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు- గడ్డ కట్టే చలిలో ఎలా చేశారు భయ్యా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Embed widget