Yoga For Libido: లైంగిక సామర్థ్యాన్ని పెంచే యోగా భంగిమలు, ఈ ఆసనాలతో శృంగారంలో తిరుగే ఉండదట!
యోగా ఆరోగ్యాన్నే కాదు. మీ లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇందుకు ఉపయోగపడే ఈ ఆసనాలను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేయండి.
రోజూ యోగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. యోగాకు వ్యాయామానికి చాలా తేడా ఉంటుంది. యోగా కోసం చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. కొన్ని భంగిమలతో ఒళ్లును విల్లులా వంచితే చాలు.. శరీరంలోని అన్ని అవయవాలు వాటికవే సెట్ అవుతాయి. మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచేందుకు సహకరిస్తాయి. యోగా వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఒత్తిడిని దూరం చేసి రోజంతా మిమ్మల్ని రిలాక్స్‌గా ఉండేలా చేస్తాయి. ఏకాగ్రత కూడా లభిస్తుంది. యోగా మీ ఇంద్రియ, మానసిక, శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. యోగా ఆరోగ్యానికే కాదు.. శృంగారానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉంటేనే పురుషుల్లో అంగస్తంభనలు సక్రమంగా ఉంటాయి. అలాగే, స్త్రీలు భావోద్వేగ అనుభూతిని పొందగలరు. కొన్ని యోగాసనాలు ద్వారా స్త్రీ, పురుషులు తమ శృంగారం సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అవేంటో చూసేయండి.
యోగాలో చాలా భంగిమలు ఉంటాయి. మరి, శృంగార సామర్థ్యాన్ని పెంచుకోడానికి ఎలాంటి ఆసనాలు వేయాలనే సందేహం చాలామందిలో ఉంటుంది. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నేపథ్యంలో ఆ ముఖ్యమైన ఆసనాల వివరాలను మీకు ఇక్కడ అందిస్తున్నాం.
ఆంజనేయాసన:
ముందు నిటారుగా నిలబడండి. ఆ తర్వాత ఒక కాలును ముందుకు పెట్టండి. మరొక కాలును మోకాలు నేలను తాకేలా చాచండి. ఆ తర్వాత రెండు చేతులను పైకెత్తండి. లేదా రెండు చేతులను దగ్గరకు చేర్చి నమస్కారం భంగిమలో ఉండండి. దీని వల్ల మీకు శరీరం సాగిన అనుభవం కలుగుతుంది. ఈ భంగిమ వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగువుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఉస్త్రాసనం:
ఈ ఆసనం కోసం మోకాళ్లపై కూర్చోండి. ఆ తర్వాత వెనక్కి వంగి రెండు చేతులో కాళ్లను పట్టుకోండి. మీ తుంటి భాగం ముందుకు, వీపు వెనక్కి వంగేలా ఉండాలి. ఆ తర్వాత మీ తలను పూర్తిగా తలకిందులుగా చూస్తున్నట్లుగా పెట్టండి. ఇలా కనీసం 20 సెకన్లపాటు చేయండి. రెండు మూడుసార్లు మళ్లీ మళ్లీ చేయండి. ఈ భంగిమ వల్ల చురుగ్గా, రిలాక్స్‌గా ఉంటారు.
బద్ధ్ కోనాసన:
ఈ ఆసనం కోసం మీరు ఫొటోలో చూపినట్లుగా వీపు నిటారుగా పెట్టి కూర్చోండి. కాళ్లు రెండు దగ్గరకు ముడుచుకుని మీ మధ్య భాగానికి తీసుకురండి. ఆ తర్వాత మోకాళ్లను అటూ ఇటూ వదిలి చేతులతో రెండు పాదాలను కలిపి పట్టుకోండి. ఇలా కనీసం 20 సెకన్లపాటు చేయండి. ఓపిక ఉంటే 30 నుంచి 40 సెకన్లు కూడా చేయొచ్చు. ఇలా రెండు నుంచి మూడు సార్లు రిపీట్ చేస్తే చాలు.
మార్జారియాసనం:
మీ మోకాళ్లపై కూర్చొని ముందుకు వంగండి. మీ చేతులను నేలపై పెట్టండి. ఊపిరి పీల్చుతూ మీ వీపును మాత్రమే నెమ్మదిగా పైకి లేపాలి. ఆ తర్వాత ఊపిరి వదులుతూ వీపును కిందికి దించాలి. ఆ సమయంలో మీ చేతులు నేలపై నుంచి పైకి లేవకూడదు. అంటే మీ భంగిమ పిల్లి నిలుచున్నట్లుగా ఉండాలి. ఇలా రోజుకు 10 సార్లు నెమ్మదిగా చేయాలి. అలవాటు అయ్యే కొద్ది సంఖ్య పెంచుకుంటూ వెళ్లండి. ఈ భంగిమ వల్ల మీ వెన్నుము బలంగా ఉంటుంది. ఊపిరి పీల్చుకుంటూ వదలడం వల్ల శ్వాసక్రియ లయబద్దంగా ఉంటుంది. దీనివల్ల బెడ్ రూమ్‌లో ఆ పని చేసేప్పుడు త్వరగా అలసిపోరు.
Also Read: శృంగారం ఇంత సేపు చేస్తే మీరే కింగ్స్, భారతీయుల సరాసరి టైమ్ ఇదే!
సేతు బంధాసనం:
ముందుగా మీరు నేలపై వెల్లకిలా పడుకోండి. ఆ తర్వాత మీ కాళ్లను ఫొటోలో చూపినట్లు మోకాళ్లు పైకి వచ్చేలా కాళ్లను పైకి లేపండి. మీ చేతులను నిటారుగా నేలపై పెట్టాలి. ఆ తర్వాత మీ పిరుదులు, నాభి ప్రాంతం(పొట్ట), ఛాతి భాగాన్ని పైకి లేపాలి. ఇలా కనీసం 30 సెకన్ల ఆ భంగిమలో ఉండండి. ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు పాటు చేయండి. ఈ భంగిమ మీకు కొత్తైతే మొదట్లో ఒకసారి. అలవాటైన తర్వాత రెండు లేదా మూడు సార్లు ప్రయత్నించండి. ఈ భంగిమను ఎలాగైతే వేశారో.. అలాగే నెమ్మదిగా సాధారణ స్థితికి తీసుకొచ్చి వెల్లకిలా పడుకోంది. ఈ భంగిమ వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జననేంద్రియ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగువుతుంది. ఫలితంగా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
Also Read: ఎక్కువ సేపు శృంగారం చేయాలని ఉందా? ఇలా చేస్తే మీరే ఛాంపియన్!
భుజంగాసనం, మండుకాసన్, మూలబంధ, బాలాసన, శవాసనలు కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. అయితే, మీ వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ ఆసనాలను ఎంచుకోవాలి. ఈ కథనంలో చెప్పినట్లు కాకుండా.. యోగా గురువులను సంప్రదించి, అధ్యయనం చేస్తే మరింత మంచిది. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కలిగిన బాధితులు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.