Bahadurpura Flyover: బహదూర్ పురా ప్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్, పాతబస్తీలో తీరనున్న ట్రాఫిక్ సమస్యలు

KTR inaugurates Bahadurpura Flyover: ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులలో భాగంగా నిర్మించిన బహదూర్ పురా ప్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి  కేటీఆర్ ప్రారంభించారు.

FOLLOW US: 

Bahadurpura Flyover in Hyderabad: విశ్వనగరం హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ నేడు అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులలో భాగంగా నిర్మించిన బహదూర్ పురా ప్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ పొడవు 690 మీటర్లు. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్ నగర్ జిల్లాల వైపు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించేందుకు పాతబస్తీలోని బహదూర్ పురా జంక్షన్ వద్ద టీఆర్ఎస్ సర్కార్ ఫ్లై ఓవర్ నిర్మించింది.

రూ.500 కోట్లతో పాతబస్తీలో డెవలప్‌మెంట్.. 
వీటితో పాటు దాదాపు రూ. 500 కోట్లతో చేపట్టనున్న ముర్గీచౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్ ఆధునీకరణ మరియు  పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ సురభివాణి దేవి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అటు కొత్త నగరం, ఇటు పాత బస్తీ రెండిటినీ సమానంగా అభివృద్ధి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఆరాంఘర్ నుంచి ట్రాఫిక్ సమస్యలకు చెక్.. 
ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డు చుట్టపక్కల ప్రాంతాల్లో అబుల్ కలాం ఆజాద్, బైరమల్ గూడ ఫ్లై ఓవర్‌లను ఇటీవల ప్రారంభించారు. తాజాగా బహదూర్ పుర ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో నగరంలోని పాతబస్తీ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తగ్గనున్నాయి. ఈ ఫ్లైవర్ ద్వారా తూర్పు ప్రాంతం నుంచి శంషాబాద్ వరకు, శంషాబాద్ నుంచి తూర్పు ప్రాంతం మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. బహదూర్ పుర ఫ్లై ఓవర్ నిర్మాణం, భూ సేకరణ నిమిత్తం రూ.108 కోట్లు మేర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అదే సమయంలో ఫ్లై ఓవర్ కింది భాగంలో సుందరీకరణ పనులకు సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లై ఓవర్ ద్వారా ఆరాంఘర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. 

Also Read: Group 1 Notification: ఈ వారం నుంచే తెలంగాణలో ఉద్యోగాల జాతర - అదే రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ !

Also Read: Weather Updates: పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఇక కూల్ కూల్‌గా ఏపీ, తెలంగాణ - రైతులకు కీలక సూచన

Published at : 19 Apr 2022 11:21 AM (IST) Tags: telangana Hyderabad trs KTR Bahadurpura Flyover

సంబంధిత కథనాలు

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు