Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Ashu Reddy Reaction : రోడ్డు ప్రమాదంలో హీరో భరత్ మృతిపై బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ప్రాణ స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Ashu Reddy Emotional Post On Bharath Kanth Death : బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో భరత్ కాంత్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను కోల్పోయానని చెబుతూ అతనితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.
నా ప్రాణ స్నేహితుడా...
భరత్ మృతి తనకు తీరని లోటని రాసుకొచ్చారు అషు రెడ్డి. 'ఇది నాకు తీరని లోటు... నా ప్రాణ స్నేహితుడు, నా కుటుంబం, అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి ఇప్పుడు శివయ్యతో ఉన్నాడు. నీకు చేరని ఓ సందేశాన్ని నేను పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నీ చిరునవ్వు, నీ ముఖం ఎప్పటికీ గుర్తుంటాయి.. భరత్ కాంత్.. నా ప్రాణ స్నేహితుడా, బరువైన, విరిగిన హృదయంతో, వీడ్కోలు భరత్.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
భరత్ కాంత్ మృతి పట్ల పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, సినీ నటులు విచారం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఫేం షణ్ముఖ జశ్వంత్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read : సూర్య ఫేస్‌లో హిట్టు కళ కనబడుతోంది... త్రిష కొత్త సినిమా 'కరుప్పు' ట్రైలర్
రోడ్డు ప్రమాదంలో...
ఏపీలోని నెల్లూరుకు చెందిన నటుడు భరత్ కాంత్ (31), కెమెరామెన్ త్రిలోక్ (31) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పదేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చిన వీరిద్దరూ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటూ సినిమా ఛాన్సెస్ కోసం ప్రయత్నించారు. ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన భరత్ కాంత్... రీసెంట్‌గా టెనెంట్ సినిమాలో హీరోగా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు తిలక్ వర్మ సైతం సినిమాటోగ్రాఫర్‌గా ప్రయత్నాలు చేస్తుండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.
వ్యక్తిగత పనుల నిమిత్తం సొంతూరుకు వెళ్లిన ఇద్దరూ శనివారం రాత్రి కారులో వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున అంబర్‌పేట ORR ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా... వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జయ్యింది. అతి వేగమే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతి పట్ల సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేసింది.
ట్రెండింగ్ వార్తలు






















