అన్వేషించండి

CM Revanth Reddy: నవంబర్ 11లోగా KCRను అరెస్ట్ చేసి నిరూపించుకోండి.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్C

Telangana News | తెలంగాణలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ 11లోగా అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవావ్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం కాకపోతే... నవంబర్ 11వ తేదీ లోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి... మాజీ సీఎం కేసీఆర్‌త పాటు హరీష్ రావు, కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పర్టీలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్‌కు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని బీఆర్‌ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. 

జూబ్లీహిల్స్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చిన పీజేఆర్

ఈ సందర్భంగా దివంగత నేత పీజేఆర్ (పి. జనార్దన్ రెడ్డి) కుటుంబానికి, నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్యల విషయంలో బీజేపీ వైఖరిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ నాయకులు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పీజేఆర్‌తో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, గతంలో ఈ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేదన్నారు. ఇక్కడి బస్తీవాసుల తాగునీటి కష్టాలు తీర్చాలని ఆనాడు ఖాళీ కుండలతో పీజేఆర్ ధర్నా చేశారని గుర్తుచేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి కృష్ణా జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చిన గొప్పనేత పీజేఆర్ అని కొనియాడారు.

లక్షలాది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన పేదోళ్ల దేవుడు పీజేఆర్ అని పేర్కొన్నారు. పీజేఆర్ కుటుంబానికి కేసీఆర్ అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా మరణిస్తే, టీడీపీ, బీజేపీ అభ్యర్థిని పెట్టకుండా ఆ కుటుంబాన్ని ఏకగ్రీవంగా నిలబెట్టేందుకు అండగా నిలబడ్డాయన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. పీజేఆర్ సతీమణి కేసీఆర్‌ను కలిసేందుకు వెళితే, 3 గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదే పదే చెప్పారు. కాళేశ్వరం కేసును సీబీఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామన్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాపోతే.. వాళ్లది ఫెవికాల్ బంధం కాకపోతే... ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసీఆర్, హరీష్, కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. 

ఫార్ములా ఈ రేస్ (Formula E Race) కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముందుగానే చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు పరోక్ష మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని, ఇది నేను అంటున్నది కాదు... వాళ్ల ఆడబిడ్డ కవిత చెప్పిన మాటలే అని జూబ్లీహిల్స్ వాసులు, తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget