అన్వేషించండి

Army Recruitment: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్, ఆగస్టు 1న సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్

Army Recruitment Rally Agniveer posts | మాజీ సైనికుల పిల్లలు, వితంతులు, అమరులైన సైనికల పిల్లలకు సికింద్రాబాద్ వేదికగా ఆగస్టులో స్పెషల్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

సికింద్రాబాద్: యూనిట్ హెడ్‌క్వార్టర్స్ కోటా రిక్రూట్‌మెంట్ ర్యాలీ (అగ్నివీర్) త్వరలో ప్రారంభం కానుంది. యునిట్ హెడ్‌క్వార్టర్ కోటా (UHQ) కింద ఆగస్టు 01, 2025న సికింద్రాబాద్‌లోని 1 EME సెంటర్‌లో అగ్నివీర్ వీరుల పోస్టుల కోసం ఆర్మీ రిక్రూట్ మెంట్ చేపట్టనుంది. యుద్ధ వితంతువులు/ వితంతువులు/ మాజీ సైనికులు/ సైనికుల కుమారులు, సైనికులు/మాజీ సైనికుల సొంత సోదరుల కోసం సెలక్షన్స్ జరగనున్నాయి. అగ్నివీర్ (GD), అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ Tdn 10వ ఎడ్న్ STD కేటగిరీ (చెఫ్), ఓపెన్ కేటగిరీ కోసం అగ్నివీర్ కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్ విడుదలైంది. స్విమ్మింగ్, వాలీబాల్, డైవింగ్ విభాగాలలో స్పోర్ట్స్ కేటగిరీలో ఓపెన్ విభాగంలో అగ్నివీరుల నియామకం చేపడుతున్నారు. 

ఏజ్ లిమిట్
అన్ని విభాగాల్లోనూ అభ్యర్థులకు వయోపరిమితి 17 ½ నుండి 21 సంవత్సరాలు (01 అక్టోబర్ 2004 కి ముందు జన్మించరాదు, 01 ఏప్రిల్ 2008 తర్వాత జన్మించకూడదు) పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు వారిని అర్హులుగా పరిగణిస్తారు. 

విద్యార్హత..
అగ్నివీర్ జనరల్ డ్యూటీకి విద్యార్హత 10వ తరగతి / మెట్రిక్ లేషన్ ఉత్తీర్ణత. మొత్తం 45% మార్కులతో పాస్ కావాలి. ప్రతి సబ్జెక్టులో 33% శాతం మించి రావాలి. గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే బోర్డులకు, కనీసం 'D' గ్రేడ్ (వ్యక్తిగత సబ్జెక్టులలో 33%-40%) లేదా నిర్దిష్ట సబ్జెక్టులలో 33%. మొత్తం 'C2' గ్రేడ్ లేదా సమానమైన 45%కి అనుగుణంగా గ్రేడ్‌లు ఉండాలి.

అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు అయితే సైన్స్‌లో 10+2 / ఇంటర్మీడియట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీషుతో కనీసం 50% మార్కులతో.. ప్రతి సబ్జెక్టులో 40% మార్కులతో పాస్ కావాలి. పైన పేర్కొన్న విద్యా అర్హతతో ఏదైనా గుర్తింపు పొందిన రాష్ట్ర విద్యా బోర్డు లేదా సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుండి NIOS, ITI కోర్సులో కనీసం ఒక సంవత్సరం NSQF స్థాయి 4 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. 50% మార్కులతో 10వ తరగతి / మెట్రిక్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్, మ్యాథ్స్,  సైన్స్‌లో కనీసం 40% ITI నుండి రెండు సంవత్సరాల సాంకేతిక శిక్షణ అవసరం.
లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంటల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (అన్ని రకాలు), సర్వేయర్, జియో-ఇన్ఫర్మేటిక్స్ అసిస్టెంట్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, వెసెల్ నావిగేటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్.

అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు 10వ తరగతి (చెఫ్), 10వ తరగతి సాధారణ ఉత్తీర్ణత చాలు. మొత్తం మార్కుల శాతంలో ఎలాంటి నిబంధన లేదు. కానీ ప్రతి సబ్జెక్టులో కనీసం 33% స్కోర్ చేయాలి. 

అర్హత ఉన్న అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి 1 ఆగస్టు 2025న ఉదయం 6 గంటలకు మిల్కా సింగ్ స్టేడియం, 1 శిక్షణ బెటాలియన్, 1 EME సెంటర్, సికింద్రాబాద్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఇతర వివరాల కోసం, అభ్యర్థులు ప్రధాన కార్యాలయం, 1 EME సెంటర్, బొల్లారం, సికింద్రాబాద్, తెలంగాణ, పిన్ - 500010 లో సంప్రదించవచ్చు లేదా awwaleagle@gmail.com కు ఇమెయిల్ చేయాలని సూచించారు. లేదా www.joinindianarmy@nic.in ని సందర్శించవచ్చు లేదా 040-27863016 నెంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఏ దశలోనైనా అభ్యర్థిత్వాన్ని/ ర్యాలీని రద్దు చేసే హక్కు కమాండెంట్ 1 EME సెంటర్‌కు ఉంటుందని అభ్యర్థులకు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget