By: ABP Desam | Updated at : 13 Apr 2023 12:35 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సంగతి పక్కన పడేసి దాసోహం అయ్యారంటూ తెలంగాణ మంత్రి చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు సీరియస్ అయ్యారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
ఫామ్‌హౌస్‌లో మామాతో కలిసి హరీష్‌రావు కల్లుతాగిన మాట్లాడారా అని ప్రశ్నించారు అప్పలరాజు. కల్లుతాగిన కోతిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పలరాజు కామెంట్స్ ఆయన మాటల్లోనే.... "మీ మామలాగ ఫామ్‌హౌస్‌లో కూర్చొని కల్లు తాగడం లేదు ఇక్కడ. లేకపోతే కవితక్కలా అలాంటి చాట్‌లు కూడా లేవు మా దగ్గర. మా దగ్గర మీలా లిక్కర్ స్కామ్‌లు ఏమీ లేవు. మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హరీష్‌రావు కోరుతున్నాను. సిగ్గు ఎగ్గు లేకుండా ప్రైవేటైజేషన్ చేస్తే బిడ్ వేస్తామని చెబుతావా... అంటే ఏంటీ దాని అర్థం. ప్రైవేటైజేషన్‌కు నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా... దొరల పాలనలో ఏం జరుగుతుంది. నువ్వెమో మంత్రివి.. నీ మామ ఏమో ముఖ్యమంత్రి. ఆయనకో కొడుకు ఆయనో మంత్రి. తెలంగాణ మీ జాగీరా మీరో ప్రాంతీయ ఉగ్రవాదులు. నువ్వు, నీ మామ, నీ మామ కొడుకు, మీ మామ కూతురు మీరంతా కూడా ప్రాంతీయ ఉగ్రవాదులు. పనికి మాలిన మాటలు ఆపి... మీ పనేదో మీరు చూసుకోండి. మా ఆంధ్రావాళ్లు తెలంగాణ నుంచి వచ్చేస్తే అక్కడ ఏమీ ఉండదు అడుక్కుతినడం తప్ప. బుర్రతక్కువ తెలంగాణ వాళ్లు. బిడ్డింకి రాకూడదని మమనం అనుకుంటే బిడ్డింగి వస్తే బిడ్ వేస్తామని వాళ్లు అంటున్నారు. ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా బిడ్డింగ్‌లో పాల్గొంటాయా. ఇది సాధ్యమా" అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.
కారుమారి నాగేశ్వరరావు నిన్న షాకింగ్ కామెంట్స్
మంత్రి హరీష్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని సూచించారు కారుమూరి. హరీష్ రావు టైం చూసుకొని ఏపీ వచ్చే ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు. తెలంగాణ స్కూళ్లకు, ఏపీలో బడులకు తేడాగా గమనించాలన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే ఇళ్లపైకి నీళ్లు వస్తాయని ఎద్దేవా చేశారు.
అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతున్నాయన్నారు కారుమూరి. ఒక్క హైదరాబాద్‌లో రోడ్లు వేస్తే సరిపోదని... రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఓట్లు వేసిన వారికే తెలంగాణలో లబ్ధికలిగిస్తున్నారని... ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగిస్తున్నామన్నారు. తాము చేసిన అభివృద్ధి మూలంగానే దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నామన్నారు.
Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!
Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత
Drone Show Durgam Cheruvu: దుర్గం చెరువుపై ఆకట్టుకున్న డ్రోన్ షో, దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహణ
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?