అన్వేషించండి

An Invaluable Invocation: ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకం ‘ఎన్ ఇన్‌ వ్యాల్యుబుల్ ఇన్వొకేషన్’ ఆవిష్కరణ - ప్రత్యేకతలు ఇవే

‘ఎన్‌ ఇన్‌వ్యాల్యుబుల్‌ ఇన్వొకేషన్‌’ పేరుతో ఈ సుదీర్ఘ భావగీతం రచించారు. ఈ పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్‌ లోని దసపల్లా హోటల్‌లో ఆవిష్కరించారు.

ప్రముఖ కవి, రచయిత, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు గ్రహీత డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి రాసిన ‘ఎన్ ఇన్‌ వ్యాల్యుబుల్ ఇన్వొకేషన్’ అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రపంచ శాంతి, సామరస్యం గురించి 10 కావ్యభాగాలుగా ఇంగ్లీషులో దీన్ని రచించారు. ‘ఎన్‌ ఇన్‌వ్యాల్యుబుల్‌ ఇన్వొకేషన్‌’ పేరుతో ఈ సుదీర్ఘ భావగీతం రచించారు. ఈ పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్‌ లోని దసపల్లా హోటల్‌లో ఆవిష్కరించారు. సీఐడీ డీఐజీ బడుగుల సుమతి, సినీ రచయిత జేకే భారవి, ఇఫ్లూ మాజీ ప్రొఫెసర్ ప్రకాశం వెన్నెలకంటి, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ మహాసంఘ్‌ జాతీయ సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శి గుంత లక్ష్మణ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్” అనే సుదీర్ఘ భావగీతం వివరాలు, ప్రత్యేకతలు ఇవీ:
1. మానవచరిత్రలోనే ప్రపంచ శాంతి, సామరస్యం గురించి ఆంగ్ల భాషలో దైవం, దైవస్వరూపులైన మానవాళిని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా రచించిన సుదీర్ఘ  భావగీతం
2. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం
3. ఈ ఏకైక, విశిష్ట పుస్తక విక్రయం ద్వారా వచ్చే 100 శాతం డబ్బు సమాజానికే!
4. ఐక్యరాజ్యసమితి దినోత్సవం, 24-10-2023 న ఈ పుస్తకం ఐక్యరాజ్యసమితికి అంకితం

పుస్తకం టైటిల్/శీర్షిక : “ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్” (An Invaluable Invocation) ఓ అమూల్యమైన ప్రార్థన 
కవి/రచయిత : డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
సాహిత్య ప్రక్రియ/ జానర్ : సుదీర్ఘ కావ్యం (Epic poem)
రచన ఉద్దేశం, ఆశయం (Scope) : మానవ చరిత్రలోనే ప్రపంచ శాంతి, సామరస్యం గురించి ఆంగ్ల భాషలో ప్రత్యేకంగా రచించిన సుదీర్ఘ భావగీతం.
ప్రధానాంశం/ఇతివృత్తం (Theme) : ప్రపంచ శాంతి, సామరస్యం
రచన నిర్మాణక్రమం (Structure) : 10 కావ్యభాగాలు / ఆశ్వాసాలు (Cantos)

ఆ పది కావ్య భాగాలు లేదా ఆశ్వాసాలు ఇవే
1. Prelude to Peace (శాంతి ప్రస్తావన / శాంతి పీఠిక)
2. Invocation (ప్రార్థన)
3. Humanity and Unity (మానవజాతి-ఐక్యత)
4. The Broken World (దుఃఖమయ ప్రపంచం)
5. Global Peace and Unity (ప్రపంచ శాంతి-ఐక్యత)
6. United Nations, United Efforts  (ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ) 
7. Protecting Our Planet  (భూమాత పరిరక్షణ)
8. Realization and Power (మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు)
9. The Final Verse : A Summation of Our Journey (అంతిమ పద్యకృతి--ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం) 
10. Acknowledgments  (కృతజ్ఞతాంజలి)

విషయం / Content : అతి ముఖ్యమైన ప్రపంచ సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రపంచ శాంతిని సాధించడానికి పరిష్కార మార్గాలు ప్రతిపాదిస్తుంది.
ప్రత్యేకత : ఆంగ్లభాషలో  సుదీర్ఘ భావగీతం (an Ode) రూపంలో  ప్రపంచ శాంతి గురించి మానవ చరిత్రలోనే అత్యంత విస్తృతమైన అన్వేషణ.
దాతృత్వపు వివరణ (Philanthropic) : ప్రత్యేకంగా తయారుచేసిన ఈ అద్వితీయ, విశిష్ట పుస్తక విక్రయం ద్వారా వచ్చే మొత్తంలో నూరు శాతం డబ్బు ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలకు వరుసగా 50%, 25%, 25% లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అంకితం చేయనున్నారు.


An Invaluable Invocation: ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకం ‘ఎన్ ఇన్‌ వ్యాల్యుబుల్ ఇన్వొకేషన్’ ఆవిష్కరణ - ప్రత్యేకతలు ఇవే

రచయిత నేపథ్యం : డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇంగ్లిష్ లో పీహెచ్ డీ / Ph.D., సైకాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ లో పీజీ చేసి, పాలమూరు విశ్వవిద్యాలయంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్, ఆంగ్ల విభాగాధిపతిగా సేవలందించి, బహుళ విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిత్వ వికాస నిపుణులు. “Forsake Me Not” టైటిల్ తో ఈయన ఆంగ్లంలో ఓ కవితా సంపుటి వెలువరించారు. అది అమెజాన్ ఆన్ లైన్ లో ‘ఈబుక్’ గా అందుబాటులో ఉంది. ఎన్నో పత్రికలలో ఆంగ్లంలో వీరు రాసిన కవితలు అచ్చు అయ్యాయి. ఇంగ్లీష్ జాతీయాలపై ఈయన రాసిన “హ్యాండీ క్రిస్టల్స్ (Handy Crystals)” పుస్తకానికి 2010 లో ‘Longest title of a book’ అనే అంశంలో గిన్నిస్ రికార్డు నమోదైంది. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస శిక్షకులుగా ‘ఫ్రీలాన్సింగ్’ సేవలు అందిస్తున్నారు, పలు సంస్థల్లో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు. 

ఈ పుస్తకం ఎవరికోసం?: ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులు, ప్రపంచ పౌరులు, ప్రతిఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే అద్వితీయ, అమేయ భావగీతమిది.


An Invaluable Invocation: ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకం ‘ఎన్ ఇన్‌ వ్యాల్యుబుల్ ఇన్వొకేషన్’ ఆవిష్కరణ - ప్రత్యేకతలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget