Hyderabad News: హైదరాబాద్‌లో ఆమ్రపాలికి కీలక పదవి - మరో ఆరుగురు IASల ట్రాన్స్‌ఫర్
Amrapali Kata: ఆరుగురు ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఆమ్రపాలి కాటాకు కీలక పదవిని అప్పగించారు.
GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటిదాకా అమ్రపాలికి కొన్ని అదనపు బాధ్యతలు ఉండగా వాటి నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రస్తుతం ఆమె హెచ్‌ఎండీఏ జాయింట్ డైరెక్టర్, మూసీ అభివృద్ధి, హెచ్‌జీసీఎల్ అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండగా.. ఇకపై జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కొనసాగనున్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి ఇక పూర్తి బాధ్యతలు తీసుకోనుండగా.. మూసీ నది డెవలప్‌మెంట్ ఎండీగా దాన కిషోర్‌ను, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవను ప్రభుత్వం నియమించింది. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా ఛాహత్ బాజ్‌పేయ్‌ను ప్రభుత్వం నియమించింది. హెచ్ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ వాటర్ వర్క్స్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్‌ను నియమంచారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.