By: ABP Desam | Updated at : 07 Mar 2023 11:25 AM (IST)
రాజ్ భవన్‌లో మాట్లాడుతున్న పూనమ్ కౌర్
తెలంగాణలో తనను పరాయి వ్యక్తిగా గుర్తిస్తూ వెలివేసినట్లుగా చేస్తున్నారని నటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణలో బిడ్డ అని, హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాజ్ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేసి చూస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయినని చెబుతుంటారు. నేను ఇక్కడే పుట్టాను.. పెరిగాను. నా మతం నన్ను నా రాష్ట్రం నుంచి వేరు చేయదు. మీ అందరిలాగానే నేను తెలంగాణ బిడ్డని. నేను మైనార్టీ సిక్కు అమ్మాయినని చెప్పి వేరుచేస్తున్నారు’’ అని మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాక, తాను రాసిన ఓ కవితను కూడా చదివి వినిపించారు.
పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గవర్నర్ ఎదుటే రాజ్ భవన్‌లో ఓ మహిళ ఇంత బహిరంగంగా, ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతో పాటు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్, త్రివిద దళాల్లో పని చేసే మహిళా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో అవార్డు - గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీకి గుర్తింపు
TSPSC Paper Leak Case: సిట్ ఆఫీసులో ముగిసిన అనితా రామచంద్రన్ విచారణ
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
PBKS Vs KKR: కోల్కతాకు వర్షం దెబ్బ - డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ లాజిక్ వేరే...
LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్కే ఓటు!
NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్కు ఎన్టీఆర్ వచ్చేశాడు