Miss World Grand Final : ప్రపంచంలో ఎక్కడున్నా.. హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్‌ని లైవ్‌లో చూడొచ్చు, డిటైల్స్ ఇవే
Miss World Event Live : 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ తుది దశకు చేరుకుంది. మిస్ వరల్డ్‌గా ఎవరు విజేతగా నిలవబోతున్నారో సాయంత్రం తెలిసిపోతుంది. ఈ ఈవెంట్‌ని లైవ్ ఎలా చూడాలంటే ఇవి ఫాలో అయిపోండి.

72nd Miss World Grand Final Event : తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అద్భుతంగా జరుగుతున్నాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ హైదరాబాద్‌లో మొదలైంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ ఈ వేడుకకు వేదికగా మారింది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు లైవ్‌లో చూసేవిధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అవేంటో చూసేద్దాం.
ప్రపంచ సుందరి ఎవరో తెలుసుకోవాలనే కోరిక ఉన్నవారందరూ.. ప్రపంచంలో ఎక్కడా ఉన్నా ఈ ఈవెంట్ చూసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌ను ఎంపిక చేసిన దేశాలలో అక్కడి నేషనల్ టెలివిజన్ ద్వారా లేదా www.watchmissworld.com అధికారిక వెబ్సైట్ ద్వారా చూసే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనిలో మీరు మిస్ వరల్డ్ పే-పర్-వ్యూ ప్లాటాఫామ్ ద్వారా హై డెఫినిషన్‌లో చూడవచ్చు.
She’s walked the talk of purpose. Tonight, she walks towards the crown. Watch Nandini Gupta at the Miss World Grand Finale, 6:30 PM on Sony LIV!#MissWorld #72MissWorld #MissWorldOnSonyLIV #BeautyWithAPurpose pic.twitter.com/OyoABeED4j
— Sony LIV (@SonyLIV) May 31, 2025
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ ప్రసార సమయాలు..
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మే 31, 2025 అంటే శనివారం రోజున హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ స్టార్ట్ కానుంది. టీవీలో లైవ్ అందుబాటులో ఉంది కాబట్టి.. మీరు ఈవెంట్‌ను చూడాలనుకుంటే స్థానికంగా ప్రసారమయ్యే ఛానల్స్‌లో చూడవచ్చు. లేదంటే www.watchmissworld.com వెబ్సైట్ ద్వారా వీక్షించవచ్చు. ఇండియాలో ఈ ఈవెంట్‌ని చూడాలనుకునేవారు SonyLIVలో చూడొచ్చు.
అందం, అంతర్జాతీయ ఐక్యతకు వేడుకగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 108 మంది యువతులు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ ఏడాది ఈ ఈవెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. తెలంగాణ సాంస్కృతిని ప్రతిబింబించేలా ఈ గ్రాండ్ ఫైనల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యూటీతో పాటు.. తెలివితేటలను కూడా కంటెస్టెంట్లు చూపించాల్సి ఉంటుంది. 'బ్యూటీ విత్ ఎ పర్పస్' అనే కాన్సెప్ట్‌తో సామాజిక అవగాహన కల్పించనున్నారు.
నందిని గుప్తా..
టాప్ మోడల్ విన్నర్స్‌లో ఇండియాను రిప్రెజెంట్ చేస్తున్న నందిని గుప్తా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 108 మంది పోటీదారులు పాల్గొనగా.. నాలుగు కాంటినెంటల్ విన్నర్స్‌లో నందిని గుప్తా నిలిచి 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ క్వార్టర్ ఫైనల్లో ఫాస్ట్ ట్రాక్ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే భారతీయులు ఈమె ప్రపంచ సుందరిగా గెలవాలని కోరుకుంటున్నారు.
నందిని గుప్తా మిస్ వరల్డ్ కిరీటం అందుకుంటే ఇండియాను విజేతగా నిలిపిన 7 బ్యూటీగా నిలిస్తుంది. ఇప్పటివరకు రీటా ఫరియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. 2017 తర్వాత ఇండియాకు ఈ మిస్ వరల్డ్ కిరీటం దక్కలేదు. ఈ ఏడాది వస్తుందో.. లేదో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.






















