News
News
వీడియోలు ఆటలు
X

2BHK Housing Scheme: ప్రతి పనికిమాలినోడు డబుల్ బెడ్రూంలపై విమర్శిస్తాడు: తలసాని

Minister Talasani Srinivas: హైదరాబాద్ జూబ్లీహిల్స్ కమలానగర్ లో రెండు పడకగదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. డబుల్ బెడ్రూములపై ప్రతిపక్ష నాయకుల విమర్శలను తిప్పికొట్టారు.

FOLLOW US: 
Share:

2 BHK Housing Scheme: ప్రతి పనికిమాలినోడు డబుల్ బెడ్రూములు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారని.. వారికి కళ్లు కనిపించట్లేదా అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కమలానగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్ బెడ్ రూము ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలినోళ్లు ఇళ్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారని, వారికి కళ్లు కనిపించడం లేదా అని తలసాని ప్రశ్నించారు.

‘‘ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు. వాడికి కళ్లు కనిపిస్తలేనట్లు ఉన్నాయి. 58 జీవో ప్రకారం పేదవారి ఇళ్లు రెగ్యులరైజ్ చేసినం.. పింఛన్లు ఇస్తున్నాం.. డబుల బెడ్ రూములు కట్టిస్తున్నాం.. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ ఇస్తున్నాం’’ అంటూ మంత్రి మాట్లాడారు. డబుల్ బెడ్రూము ఇళ్లను పప్పు, బెల్లం లాగా ఎవరికి పడితే వారికి పంచడానికి లేదని మంత్రి అన్నారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర ఖర్చు అయ్యేదని తెలిపారు. కానీ ఇప్పుడు ఒక్కో రెండు పడక గదుల ఇల్లు నిర్మించడానికి రూ. 9 లక్షలు ఖర్చు అవుతున్నట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరూ చాలా మాట్లాడుతున్నారని.. కానీ పేదల కోసం ఏమీ చేయరని విమర్శలు గుప్పించారు. అందరికీ ఇల్లు ఇస్తామని.. ఎవరు భయపడాల్సిన పని లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

మహిళపై మంత్రి ఆగ్రహం

ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మహిళపై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని ఓ మహిళ తలసానిని కోరారు. మహిళ విజ్ఞప్తిపై మంత్రి సరైన సమాధానం చెప్పకపోగా.. ఆమెపై సీరియస్ అయ్యారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ఇల్లు కట్టిస్తున్నారా అని తిరిగి మంత్రి ఆ మహిళను ప్రశ్నించారు. మహిళ తనకు ఇల్లు కోరగా తనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తలసాని తీరు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు.

17 కోట్ల అంచనాతో 210 డబుల్ బెడ్రూంల నిర్మాణం

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ను మురికి వాడలు లేని నగరంగా మార్చాలన్న సంకల్పంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూముల నిర్మాణాన్ని చేపట్టింది. మురికి వాడల్లో గుడిసెలు తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్రూములు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ లో దాదాపు 17 కోట్ల అంచనాతో 210 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది రాష్ట్ర సర్కారు. ఈ నిర్మాణ సముదాయాన్ని ఇవాళ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 210 డబుల్ బెడ్ రూముల నిర్మాణానికి మొత్తంగా రూ. 16.27 కోట్లు ఖర్చు అయింది. రూ. 15.5 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు. వాటర్ ట్యాంక్, విద్యుత్ సరఫరాతో పాటు 15 దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా షట్టర్ లు నిర్మించారు. ఈ రెండు పడక గదుల ఇళ్ల సముదాయానికి 'డిగ్నిటీ కాలనీ'గా నామకరణం చేశారు.

Published at : 18 May 2023 06:39 PM (IST) Tags: Minister Talasani Double Bedroom inaugurate talasani fire talasani criticize

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత