అన్వేషించండి

తల్లిదండ్రులపై యువతి ఫిర్యాదు- బలవంతపు పెళ్లి చేస్తున్నారని ఆవేదన

తల్లిదండ్రలు తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని 19 ఏళ్ల యువతి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. తాను చదువుకోవాలని, తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పేర్కొంది.

ఆడపిల్లను చాలా మంది తల్లిదండ్రులు భారంగా భావిస్తారు. త్వరగా పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటారు. ఒక అయ్య చేతిలో పెడితే తమ బాధ్యత నెరవేరినట్లే అని భావిస్తారు. కొంతమంది అయితే చిన్న పిల్ల అని కూడా చూడకుండా పెళ్లి చేస్తారు. బాల్య వివాహాలు చేయడం, చేసుకోవడం తప్పు అని తెలిసినా ఇవి సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బిడ్డ ఈడుకు వచ్చిందని అనిపించగానే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతారు.

పెళ్లి వద్దు నేను చదువుకుంటా..!

హైదరాబాద్ లో ఓ యువతి తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని మానవ హక్కుల కమిషన్(హ్యూమన్ రైట్స్ కమిషన్-HRC) ను ఆశ్రయించింది. తనకు పెళ్లి వద్దని, చదువుకుంటానని ప్రాధేయపడింది. హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం వాసి 19 ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. తనకు గత నెల 31వ తేదీన తల్లిదండ్రులు బలవంతంగా నిశ్చితార్థం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినకుండా, చదువుకుంటానని చెప్పినా పట్టించుకోకుండా ఈ నెల 20వ తేదీన పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సిద్ధం అవుతున్నారని పేర్కొంది. తనకు పెళ్లి చేయకుండా పేరెంట్స్ కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. 

తల్లిదండ్రులు రావాలన్న హెచ్చార్సీ..

తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యువతి, ఓ లాయర్ సాయంతో మానవ హక్కుల కమిషన్(HRC) ని ఆశ్రయించింది. తనకు పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, వివాహానికి మానసికంగా సన్నద్ధంగా లేనని ఫిర్యాదులో చెప్పింది. తనకు చదువు అంటే ఎనలేని ఇష్టం అని ఉన్నత చదువులు అభ్యసించాలని ఉందని పేర్కొంది. తన పెళ్లిని ఆపు చేయించాలని, ఆ మేరకు తల్లిదండ్రులకు ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదు చేసింది.

అమ్మాయి ఫిర్యాదును స్వీకరించిన హ్యూమన్ రైట్స్ కమిషన్... తల్లిదండ్రులను పిలిచింది. ఇవాళ జరిగే విచారణకు యువతి, యువతి తల్లిదండ్రులు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం జరగనున్న విచారణలో మానవ హక్కుల కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందో అని చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు మరికొందరికి ఆదర్శం కావాలని... ఇష్టం లేని పెళ్లి చేయాలనే తల్లిదండ్రులు మార్పలు రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 

ఇష్టాయిష్టాలతో పని లేదు..

పెళ్లికి సంబంధించి ఆడపిల్లల ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. ఎవరో ఒకరిని వారికి నచ్చిన వారిని ఇచ్చి పెళ్లి చేస్తారు. మరికొందరైతే కన్న బిడ్డలకు తెలియకుండానే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. కనీసం పెళ్లి కొడుకును కూడా చూసే అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తారు కొందరు తల్లిదండ్రులు. ఇలాంటి బలవంతపు పెళ్లిళ్లు, బాల్య వివాహాలు, ఇష్టం లేని పెళ్లిళ్లలపై యువతులు పోలీసులను ఆశ్రయించవచ్చు. తమకు ఎదురైన సమస్యపై ఫిర్యాదు చేస్తే వాళ్లు అండగా ఉంటారు. కానీ చాలా మంది అమ్మాయిలు పోలీసు స్టేషన్ వరకు వెళ్లేందుకు ఇష్టపడరు. మరికొందరిలో ఆ అవగాహన ఉండదు. అందుకే బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువ అయిపోయాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget