AEE Nikhesh Kumar: ఏఈఈ నిఖేశ్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Acb Raids | నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్‌ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నిఖేష్ కుమార్‌ను చంచలగూడ జైలుకు తరలించారు.
14 days Remand for AEE Nikhesh Kumar and shifted to chanchalguda jail | హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏఈఈ నిఖేశ్ కుమార్ ను శనివారం రాత్రి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం న్యాయమూర్తి నివాసంలో నిఖేష్ ను హాజరు పరిచారు. నిఖేష్‌కు జడ్జి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు నిఖేష్ కుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరో అవినీతి అధికారిపై ఏసీబీ దాడులు
తెలంగాణలో భారీ అవినీతి తిమింగళం అధికారులకు చిక్కింది. ఏసీబీ చరిత్రలోనే రెండో అతి పెద్ద ఆపరేషన్ అని అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటూ ఏవీ అతడికి కనిపించవని.. అన్నింటికి పర్మిషన్స్ ఇస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ కోట్లు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిఖేష్ కుమార్ ఇళ్లు, ఆస్తులతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. ఖరీదైన విల్లాలు, విలువైన భూములు, బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. మార్కెట్ వాల్యూ ప్రకారం నిఖేష్ ఆస్తి 600కోట్లు ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.
నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు నార్సింగి లో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనంతో పాటు మైరాన్ విల్లా, వాసవి అట్లాంటిస్ నానక్ రామ్ గూడ, బ్లిస్ శంషాబాద్, సాస్ గచ్చిబౌలి, కపిల్ ఇన్ఫ్రా, రాయిచాందినీలో ఖరీదైన విల్లాలు ఉన్నట్లు ఏసీబీ సోదాలలో అధికారులు గుర్తించారు. మొయినాబాద్ లో మూడు ఫామ్ హౌస్ లు, తాండూర్లో మూడెకరాల వ్యవసాయ స్థలంతో పాటు బంధువుల నివాసాల్లో కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోయిస్టుల హతం
శనివారం ఓ టీమ్ హైదరాబాద్ లోని నిఖేష్ కుమార్, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే మయంలో మరో టీమ్ మొయినాబాద్ లోని తోల్‌కట్ట, సజ్జన్‌పల్లి, నక్కలపల్లిలోని ఫాంహౌస్‌లతోపాటు బంధువులకు చెందిన 19 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బహిరంగ మార్కెట్‌లో ఆ అక్రమాస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
లాకర్లపై ఏసీబీ అధికారులు ఫోకస్
నికేష్ కుమార్ బంధువులు, బినామీలకు చెందిన లాకర్లను ఏపీ అధికారులు రేపు తెరవనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఏసీబీ ట్రాప్ అయిన సిసిఎస్ మాజీ ఏసిపి ఉమా మహేశ్వర రావుతో కలిసి ఏఈఈ నిఖేష్ కుమార్ సెటిల్మెంట్ లు చేశారని ఆరోపణలున్నాయి. గత కొన్ని రోజులుగా నిఖేష్ వ్యవహారంపై ఏసీబీ నిఘాపెట్టింది. శనివారం నాడు కొన్ని టీమ్‌లుగా ఏర్పడి ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు చేసి విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు బంగారాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు