అన్వేషించండి

రెండేళ్లలో ఏఐ కేంద్రంగా తెలంగాణ- ప్రభుత్వం రిపోర్టులో ఆసక్తికరమైన అంశాలు

ఏఐ టెక్నాలజీకి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండబోతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ దిశగానే చర్యలు చేపడుతున్నట్టు ఓ నివేదిక రూపొందించింది.

ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా టెక్నాలజీ పరంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చదువుతో, టక్నాలజీతో సంబంధం లేకుండా అందరూ చెబుతున్న పదం ఏఐ. అందుకే  ప్రభుత్వాలు సైతం దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాయి. ప్రత్యేకంగా ఓ కరికులమ్ రూపొందించేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. 

తెలంగాణ ఏఐ మిషన్‌, నాస్కామ్‌ సంయుక్తంగా ఈ ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్‌పై ఓ రిపోర్టు తయారు చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి తీసుకొచ్చింది. భవిష్యత్ మొత్త ఏఐతోనే ముడిపడి ఉందని ప్రభుత్వం కూడా ఆ దిశగానే చర్యలు చేపడుతుందని ఆ రిపోర్టు సారాంశం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే ప్రభుత్వ పాలసీలు మారుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 

మరో రెండేళ్లలో ఏఐ ఆధారంగా చేసుకొని లక్షన్నర ఉద్యోగాలు రాబోతున్నాయని అంచనా వేసిందీ రిపోర్టు. ఇది ఇంకా పెరగబోతోందని కూడా చెప్పుకొచ్చింది. అందుకే ఆ మార్పులకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏఐ ఆధారిత కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు చెబుతోంది. లక్ష మందిని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తయారు చేయబోతున్నట్టు వెల్లడించింది. 

ప్రభుత్వం చేపట్టే శిక్షణ కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు, ఏఐ స్టార్టప్‌ సంస్థలు సహాయం చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏఐకి తెలంగాణ అంతర్జాతీయ కేంద్రంగా మారుబోతుందని అభిప్రాయపడింది. వివిధ కాలేజీల్లో ఈ టైప్ కోర్సులు ప్రవేశ పెట్టారని... వాటికి మంచి డిమాండ్ ఉందని భవిష్యత్‌లో మరింతగా పురోభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తోంది. ఆధునిక టెక్నాలజీపై జరుగుతున్న పరిశోధనల్లో తెలంగాణ యూనివర్శిటీలు టాప్‌లో ఉంటున్నాయని... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెయ్యి యూనివర్సిటీల్లో స్థానం సంపాదించాయన్నారు. 

ఏఐ ఆధారిత పరిశోధన పత్రాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వార్షిక వృద్ధిరేటు 31 శాతం ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది. గత పదేళ్లలో ఏఐపై 1774 పరిశోధన పత్రాలు వెలువడితే అందులో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి 177, ఐఐటీ నుంచి 65 పత్రాలు ఉన్నాయని తెలిపింది. ఏఐ ఆధారిత పరిశోధనల్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌ దేశంలో నంబరు వన్‌గా ఉందన్నారు. 

ఈ వృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై కూడా స్టడీ రిపోర్టు కొన్ని సూచనలు చేసింది. ఐటీ సంస్థల్లోని పేరున్న వారితో ఓ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని తెలిపింది. స్టార్టప్‌లు ఏర్పాటుకు ఏం చేయాలి, మార్కెటింగ్‌లో ఎలాంటి మెలకువలు పాటించాలి...పన్నులు, నిధుల సమీకరణ, కొనుగోలు, అమ్మకాలపై అవగాహన కల్పించాలన్నారు.

ఏఐ పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లతో ఓ వేదిక రూపొందించాలి. వీళ్లందరినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఏఐ ఆధారిత స్టార్టప్‌ ప్రాజెక్టులు వచ్చే సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలంది. వీళ్ల మధ్య పోటీలు పెట్టాలి. మంచి ఆలోచనలు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అవి పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా ప్రయత్నించాలని పేర్కొంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget