By: ABP Desam | Updated at : 01 Dec 2022 03:37 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీఎస్ఆర్టీసీ
TSRTC Shuttle Services : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ షటిల్ బస్‌లు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీసులు నడపనున్నారు. ఈ సర్వీసుల్లో టికెట్ బుకింగ్‌కు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ యాప్ లో బస్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంటుందని ఆర్టీసీ తెలిపింది.
ఐటీ కారిడార్ లో
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్ బస్‌లను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి ఆఫీస్‌లకు చేరుకుంటున్నారు. ఈ ప్రత్యేక షటిల్ సర్వీసుల్లో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. షటీల్ సర్వీస్ కోసం ఆన్‌లైన్ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాలతో భవిష్యత్‌లో ఐటీ కారిడార్‌లో మరిన్నీ షటీల్ సర్వీసులను పెంచనున్నారు. ఈ షటీల్ సర్వీస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు shorturl.at/avCHI లింక్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ఐటీ ఉద్యోగుల కంపెనీ వివరాలు, లోకేషన్, పికప్, డ్రాపింగ్ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.
Hello Tweeple, Kindly fill out this form: https://t.co/nUoOhW1Lt4
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) November 30, 2022
Last date to submit: 05-Dec-22 pic.twitter.com/Jr6uyA2iba
షటిల్ సర్వీసులకు ప్రత్యేక యాప్
ఐటీ ఉద్యోగులు సురక్షితంగా తమ గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్ సర్వీస్ ప్రధాన ఉద్దేశం. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆ యాప్‌లోనే టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ఈ సర్వీస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం బస్ ఎక్కడుంది, ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అనే విషయాలను ట్రాకింగ్ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. మహిళల భద్రతా కారణంగా షటిల్ బస్‌ల్లో ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఆ యాప్‌లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉంటాయని టీఎస్ఆర్టీసీ వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకోవాలని కోరుతుంది.
విద్యార్థులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ నగర విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. అంటే సిటీ బస్సులతోపాటు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ఇటీవల ప్రకటించారు. విద్యార్థుల రద్దీ దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని, సదుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ఇంజినీరింగ్ కాలేజీలు తమ సొంత వాహన సర్వీసుల కోసం 10 నెలల కాలానికి విద్యార్థుల నుంచి రూ. 30 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తుండగా.. అదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి 10 నెలల కాలానికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం కేవలం 500 బస్సులు మాత్రమే శివారులోని కళాశాలలకు నడుస్తున్నాయి. విద్యార్థుల రద్దీకి ఇవి ఏమాత్రం సరిపోవడంలేదు. తాజాగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు బస్సుల కొరత తీరనుంది.
Telangana budget 2023 : ఎన్నికల ఏడాదిలో కలర్ ఫుల్ బడ్జెట్ - బడ్జెట్లో కొత్త పథకాలు పెట్టనున్న తెలంగాణ సర్కార్ !
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా- హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు!
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!