News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hyderabad Traffic Rules : ఇకపై స్టాప్ లైన్ దాటితే బాదుడే, హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్!

Hyderabad Traffic Rules : భాగ్యనగరంలో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై స్టాప్ లైన్ దాడితే వాహనదారులకు రూ.100 ఫైన్ విధిస్తారు.

FOLLOW US: 
Share:

Hyderabad Traffic Rules : జంట నగరాల్లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.  ఇకపై ట్రాఫిక్ నిబంధలు మరింత కఠినతరం చేశారు హైదరాబాద్ పోలీసులు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌లైన్‌ దాటితే రూ.100 జరిమానా విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.వెయ్యి జరిమానా వేస్తారు. ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు ఆక్రమిస్తే భారీ జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే రూ. 600 జరిమానా విధిస్తామని ట్రాఫి్క పోలీసులు అంటున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు.  వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరుతున్నారు.  అక్టోబర్ 3 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.  

అక్టోబర్ 3 నుంచి నిబంధనలు అమల్లోకి 

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు మరిన్ని నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌  ఇప్పటికే పలు దఫాలుగా ట్రాఫిక్‌ విభాగం అధికారులతో సమావేశమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రోప్‌ (రిమూవల్‌ ఆప్‌ అబ్‌స్ట్రిక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నారు.  ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగిస్తే వాహనదారులు  రూ.1000 ఫైన్ విధిస్తారు.   అక్టోబర్ 3 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 

భారీగా పెరిగిన వాహనాల వినియోగం 

హైదరాబాద్‌ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అంతకుముందు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడే వారు కూడా కొవిడ్ తర్వాత సొంత వాహనాలను అలవాటు పడ్డారు. దిగువ మధ్య తరగతి కూడా తంటాలు పడి సొంత వాహనం కొనుక్కున్న వారూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం నగరంలో రోజు దాదాపు 77.5 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కలో తేలింది. 2019తో పోలిస్తే ఏకంగా 18 శాతం పెరిగాయి. బైక్ లే అత్యధికంగా దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయి. మరో 14 లక్షల కార్లు ఉన్నాయని పోలీసుల అధ్యయనంలో తేలింది. అయితే, సాధారణ జనాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఈ ట్రాఫిక్ సమస్యపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ సమస్య పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా చెప్పారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్‌ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. భవిష్యత్తు కోసం రూపొందించిన ట్రాఫిక్‌ పోలీసుల యాక్షన్‌ ప్లాన్‌పై కూడా వివరించారు.

క్యారేజ్‌ వే కోసం ‘రోప్‌’

రోడ్లపై ట్రాఫిక్‌ సాఫీగా కదులుతూ ఉండాలంటే మెయిన్ ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్‌ వే క్లియర్‌గా ఉండాలి. ప్రస్తుతం చాలా చోట్ల నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలపడం, ఆ క్యారేజ్ వేను ఆక్రమించడంతో అది కనపడట్లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆపరేషన్‌ రోప్‌ (రివూవల్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎన్‌కరోజ్‌మెంట్స్‌) చేపడతామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా క్రేన్ వాహనాలతో టోవింగ్‌ చేయడంతో పాటు అక్రమ పార్కింగ్‌ చేసిన వాహనాలకు క్లాంప్స్‌ వేస్తామని హెచ్చరించారు. వాహన చోదకుడికి ఇబ్బంది లేకుండా వాటిపై స్థానిక అధికారుల ఫోన్‌ నంబర్లు ఉంచుతామని అన్నారు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణలనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్స్‌ సహా ప్రతి భవనానికీ పార్కింగ్‌ ఉండేలా చూస్తామని అన్నారు. 

Published at : 30 Sep 2022 10:37 PM (IST) Tags: Hyderabad News TS News Traffic new rules traffic fines

ఇవి కూడా చూడండి

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

టాప్ స్టోరీస్

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!

Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం